మన హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?
November 8, 2016 / 11:45 AM IST
|Follow Us
టాలీవుడ్ హీరోలు సినిమాల్లో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంటారు. నిజ జీవితంలోను వేరే సామజిక వర్గానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వివాహాల్లో రెడ్డి ఇంటి యువతుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విద్యారంగంలో పేరున్న వ్యాపారవేత్త కేసీ శేఖర్‌రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డి ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అతని బాటలోనే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు ఉపాసన రెడ్డిని తన జీవితంలోకి ఆహ్వానించారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారులిద్దరూ రెడ్డిగారి అమ్మాయిలనే వివాహమాడారు.
విష్ణు మంచు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని, చిన్నకుమారుడు మనోజ్ ప్రణతిరెడ్డిని భాగస్వాములుగా చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనువడు తారకరత్న అలేఖ్య రెడ్డి ని పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తెకు తాళి కట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో అక్కినేని వారసుడు అఖిల్ చేరబోతున్నాడు. జీవీకే సంస్థల వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ రెడ్డిని పెళ్లాడబోతున్నాడు. వీరందరిని పరిశీలిస్తే మన హీరోలకు రెడ్డి గారమ్మాయిలంటేనే ఎక్కువ ఇష్టమని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది రెడ్డిగారి అల్లుడు అనిపించుకుంటారో …!