సినీ ప్రపంచంలో సినిమాకు టైటిల్ అనేది చాలా ముఖ్యం..అయితే టైటిల్ అనుకున్న తరువాత సినిమా కధ రాసిన సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో…అదే క్రమంలో కధను బట్టి..హీరో పాత్రను బట్టి సైతం సినిమాకు టైటిల్ పెడుతూ ఉంటారు…అయితే మన కధను డిమాండ్ చేసే టైటిల్ తో ఆల్రెడీ ఒక సినిమా ఉంటే…అదే టైటిల్ ను మన సినిమాకు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా….మరి ఇంకెందుకు ఆలస్యం…కధలు వేరు…హీరోలు వేరు…పాత్రలు వేరు…పతాక సన్నివేశాలు వేరు…కానీ సినిమా టైటిల్ మాత్రం ఒకటే….అలాంటి సినిమాలు కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…
జెంటిల్ మ్యాన్
2016 – నాని, సురభి, నివేద థామస్ ప్రముఖ పాత్రలతో, ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న సినిమా…ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.
దేవుడు చేసిన మనుషులు
2013 – మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మాస్ మహారాజా రవితేజ, అందాల భామ ఇలియానాతో తెరకెక్కించిన చిత్రం…
శ్రీమంతుడు
2015 – టాలీవుడ్ ప్రిన్స్, అందాల భామా శ్రుతి హాసన్ ముఖ్య తారాగణంలో హిట్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా.
ఇద్దరు మిత్రులు
1999 – మెగాస్టార్ చిరంజీవి, రమ్య కృష్ణ, సాక్షి శివానంద్ ప్రముఖ పాత్రల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం.
బందిపోటు
2015 – అల్లరి నరేశ్, ఈషా, ప్రముఖ తారాగణంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
శంకరాభరణం
2015 – ప్రముఖ కధా రచయిత కోన వెంకట్ పర్యవేక్షణలో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, నందిత రాజ్, అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా.
మోసగాళ్ళకు మోసగాడు
2015లో ప్రముఖ యువ నటుడు సుధీర్ బాబు హీరోగా, నందిని రాయ్ హీరోయిన్ గా ఏ.ఎన్ బోస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
ఆరాధన
1987 – మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సుహాసిని హీరోయిన్ గా, భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
అడవిరాముడు
2004 – టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, అందాల భామ ఆర్తి అగర్వాల్ ప్రముఖ పాత్రల్లో బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
ప్రేమ
1989 – దగ్గుపాటి వెంకటేష్ హీరోగా, రేవతి హీరోయిన్ గా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
మల్లీశ్వరి
2004 – వెంకటేష్, కత్రీనా కైఫ్ హీరో హీరోయిన్స్ గా ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన కామెడీ చిత్రం.
మిస్సమ్మ
2003 – ప్రముఖ దర్శకుడు నీలకంఠ రెడ్డి దర్శకత్వంలో శివాజీ, భూమిక చావ్లా, లయ ముఖ్య తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
మాయాబజార్
2006 – భూమిక ముఖ్య పాత్రలో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
అప్పుచేసిపప్పుకూడు
2008 – మధుమిత, రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ తారాగణంలో దర్శకుడు రేలంగి నరసింహ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
గణేశ్
2009 – శరవనన్ దర్శకత్వంలో యువ హీరో రామ్, అందాల భామ కాజల్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం.
గీతాంజలి
2014 – ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో అంజలి ప్రత్యేక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా.
దొంగాట
2015 – లక్ష్మి మంచు ముఖ్య పాత్రలో, నిర్మాణ సారధ్యంలో వంశీ కృష్ణ అనే సరికొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.