మల్టీ స్టారర్ సినిమాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది అలనాటి గుండమ్మ కధ.. అయితే అప్పట్లో హీరోలతో సంభంధం లేకుండా, మంచి కధలతో, కధనాలతో సినిమాలు వచ్చేవి. కాల క్రమేణా ఆ కధలు, ఆ కధనాలు, ఆ మల్టీ స్టారర్ సినిమాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. అయితే అదే క్రమంలో ఇప్పుడు హీరోకి హీరోకి మధ్య జరుగుతున్న వార్ ను కాస్త తగ్గించేందుకు ఎంతో మంది దర్శకులు ముల్తీ స్టారర్ తో చెక్ పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు కానీ అక్కడక్కడా ఒకటో, రెండి వర్కౌట్ అవుతున్నాయి కానీ, ఎక్కువ శాతం కాదు…దానికి కారణాలు చాలానే ఉన్నాయి…దర్శకుల లెక్కల ప్రకారం…సరైన స్ర్కీన్ టైమ్ లేదనో లేకపోతే తన క్యారెక్టర్ గ్రాఫ్ గొప్పగా లేదనో.. మన స్టార్ హీరోలు వాటిని రిజక్టు చేస్తున్నారు అనే టాక్ ఉంది.
అంతేకాకుండా చాలామంది స్టార్లు కేవలం వారి ఫ్యామిలీకి చెందిన హీరోలతోనే మల్టీ స్టారర్లు చేస్తున్నారు కాని.. ఇతర హీరోలతో చేయట్లేదు అంటూ చెబుతున్నారు. ఇక హీరోలు అయితే మంచి కధలు ఎక్కడున్నాయి, పైగా కధ దొరికినా మల్టీ స్టారర్ లో ఇద్దరి హీరోల పాత్రలు సమానంగా ఉండాలి, ఏ పాత్రలో కాస్త తేడా కనిపించినా అసలుకే మోసం వస్తుంది అని తెలుపుతున్నారు. ఇక మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి వారైతే మంచి పాత్ర అయితే చేసేందుకు సిద్దంగానే ఉన్నారు అలా వచ్చినవే, సీతమ్మ వాకిట్లో, గోపాల గోపాల సినిమాలు. ఇక ఈ తంతు అంతా చూస్తుంటే…మున్ముంధూ మనకు మల్టీ స్టారర్ సినిమాలు కష్టమే అనిపిస్తుంది.