విక్రమ్ సక్సెస్ తో టాలీవుడ్ నిర్మాతలు అలా చేస్తున్నారా?
June 28, 2022 / 07:39 PM IST
|Follow Us
ఈ ఏడాది రిలీజై అన్ని భాషల్లో లాభాలను అందించిన సినిమాలలో విక్రమ్ సినిమా ఒకటి. కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండేది. అయితే క్రమంగా తమిళ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో తమిళ సినిమాలకు మార్కెట్ తగ్గింది. అయితే విక్రమ్ సక్సెస్ తో టాలీవుడ్ నిర్మాతలు తమిళ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.
క్రేజ్ ఉన్న తమిళ సినిమాల హక్కులు కొనుగోలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ సినిమా హక్కులను తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి ఎక్కువ మొత్తం లాభాలను సొంతం చేసుకోవాలని టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. విక్రమ్ సినిమా హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరి కొందరితో కలిసి కొనుగోలు చేయగా ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలను అందించింది. కార్తీ హీరోగా సర్దార్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ఊపిరి సినిమా ద్వారా నాగార్జున, కార్తీ మధ్య అనుబంధం ఏర్పడగా ఆ అనుబంధం వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ కు ఈ హక్కులు దక్కాయని తెలుస్తోంది. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న కోబ్రా సినిమా హక్కుల కోసం లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సంస్థతో పాటు మరో సంస్థ కూడా ప్రయత్నిస్తోందని బోగట్టా. ఈ తమిళ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటే తమిళ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్, డిమాండ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు.
తమిళ సినిమాలలో చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. చాలామంది తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విక్రమ్ రిజల్ట్ ను రాబోయే రోజుల్లో రిలీజయ్యే తమిళ సినిమాలు రిపీట్ చేస్తాయో లేదో చూడాల్సి ఉంది.