Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తానంటున్న ఒకప్పటి స్టార్‌ డైరక్టర్‌.. వామ్మో అంటున్న ఫ్యాన్స్‌!

  • February 24, 2023 / 02:24 PM IST

టాలీవుడ్‌లో సింగిల్‌ ఫార్ములా సినిమాలు చేస్తూ.. హిట్‌ కొట్టిన దర్శకుల పేర్లు రాయమంటే తొలి స్థానాల్లో ఉండే పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. కామెడీని ప్రధానంగా పెట్టుకుని, కుటుంబ నేపథ్యంగా సైడ్‌ లైన్‌లో నడిపించే విజయవంతమైన దర్శకుడు ఆయన. కెరీర్‌లో దర్శకుడిగా ఆయన చూడని విజయాలు లేవు. అయితే ఒక్కటే సమస్య ఆయన పెద్ద హీరోతో సినిమా చేస్తే.. ఫట్‌ మంటుంది. చిన్న హీరోతో, మీడియం హీరోతో సినిమా చేస్తే బంపర్‌ హిట్‌ అవుతుంది.

ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చిరంజీవితో సినిమా చేస్తా అంటున్నారు కాబట్టి.స్టార్ బ‌లం లేకపోయినా అద్భుతమైన సినిమాలు సృష్టించిన చ‌రిత్ర ఎస్వీ కృష్ణారెడ్డిది. క్లీన్ సినిమాల‌కు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచిన ఆయన బాలకృష్ణతో ‘టాప్ హీరో’, నాగార్జున‌తో ‘వ‌జ్రం’ సినిమా తీసి దారుణమైన డిజాస్ట‌ర్లు మూట గ‌ట్టుకొన్నాడు. ఆ తర్వాత ఆయన పెద్ద హీరోల వరకు వెళ్లలేదు. శ్రీకాంత్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ లాంటి హీరోలతోనే కానించేశారు.

ఇప్పుడు కూడా ఓ చిన్న సినిమా చేస్తున్నారు. దీని తర్వాత అన్నీ ఓకే అయితే చిరంజీవితో సినిమా అంటున్నారు. దీంతో ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవ‌ల చిరంజీవిని ఎస్వీ కృష్ణారెడ్డి చిరంజీవిని కలిసి, సినిమా చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పారట. దానికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. త‌న‌ను ముందు నుండీ చిరంజీవి ప్రోత్స‌హిస్తున్నార‌ని.. అందుకే త‌మ కాంబోలో సినిమా రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అసలే చిరంజీవి డిజాస్టర్‌ డైరక్టర్లకు ఛాన్స్‌లు ఇస్తున్న టైమ్‌ ఇది.

మెహర్‌ రమేశ్‌తో ‘భోళా శంకర్‌’ మొదలైనప్పటి నుండి ఫ్యాన్స్‌ ఇదే భయంలో ఉన్నారు. ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ఆ భయం మళ్లీ మొదలు అంటున్నారు ఫ్యాన్స్‌. మరి నిజంగానే చిరంజీవి సినిమా కోసం అంగీకరించారా? ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. అయితే అప్పటికి వెటరన్‌ స్టార్‌ హీరో అయిన కృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి ‘నెంబర్‌ 1’ అని తీసి సూపర్‌ హిట్‌ కొట్టారు. అలా ఇప్పుడు చిరంజీవితో ఆ పని చేస్తే హ్యాపీనే. ఎందుకంటే చిరు కామెడీకి, ఎస్వీ కృష్ణారెడ్డి స్టైల్‌ తోడైతే సూపరో సూపర్‌.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus