కాస్ట్లీ కార్ క్లబ్ లో జాయినైన హాట్ యాంకర్!

  • February 17, 2020 / 07:57 AM IST

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బట్ట వేసుకుంటున్నావ్, ఎలాంటి ఇంట్లో బ్రతుకుతున్నావ్ అనే విషయం కంటే ఎలాంటి కార్ లో తిరుగుతున్నావ్ అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే.. మన సెలబ్రిటీలు అప్పుజేసైనా సరే కాస్ట్లీ కార్లు కొంటూ ఉంటారు. ఈమధ్యకాలంలో సినిమా హీరోహీరోయిన్ల కంటే యాంకర్లే కాస్ట్లీ కార్లు కొంటూ అందరూ ఆశ్చర్యపరుస్తున్నారు. అనసూయ ఆడీ కారు కొని అందర్నీ సర్ప్రైజ్ చేయగా.. అదే రేసులో శ్యామల, మంజూష వంటి ఇతర యాంకర్లు కూడా బెంజ్ కార్లు కొని మాకేం తక్కువ అనిపించుకొన్నారు.

తాజాగా ఈ క్లబ్ లో జాయిన్ అయ్యింది ఉదయభాను. సీనియర్ యాంకర్ అయినప్పటికీ కెరీర్ పరంగా వచ్చిన బ్రేకుల కారణంగా ఆశించిన స్థాయిలో ఉదయభాను బుల్లితెరపై ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కొనసాగడం లేదు. అయినప్పటికీ.. మొన్న బెంజ్ కారు కొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి రష్మి ఈ కాస్ట్లీ కార్ క్లబ్ లో ఎప్పుడు జాయిన్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus