Tollywood: 7 ఏళ్ళ తర్వాత విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ జంట!
November 21, 2023 / 03:40 PM IST
|Follow Us
సినీ పరిశ్రమలో విడాకుల న్యూస్ ల గురించి ఎక్కువగానే వింటూ ఉంటాం. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. రెండు, మూడేళ్లు బాగానే కలిసుంటారు. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా ఎక్కువగానే షేర్ చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఏమవుతుందో తెలీదు.. మనస్పర్థలు అంటూ విడాకులు తీసుకుంటారు. ఈ లిస్ట్ చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ కపుల్ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యింది. పెళ్ళైన 7 ఏళ్ళ తర్వాత ఈ జంట విడాకులకు రెడీ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అతనొక (Tollywood) టాలీవుడ్ హీరో. ఇతని కెరీర్ ప్రారంభంలో రెండు, మూడు హిట్లు పడ్డాయి. దీంతో ఇతనికి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ సరైన స్క్రిప్టులు ఎంపిక చేసుకోవడంలో ఇతను విఫలమయ్యాడు. అయితే ఓ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు అవ్వడంతో… ఈ హీరో తండ్రి మొదట ఒప్పుకోలేదు. మొత్తానికి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే తర్వాత ఇతనికి హీరో ఛాన్సులు రాలేదు. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు అయినా కలిసిరాలేదు. అటు తర్వాత తన భార్యతో కలిసి పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. అక్కడ వీరికి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో మరోసారి ఇతనికి హీరో ఛాన్స్ లభించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో తన భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ సెపరేట్ గా ఉండటం మొదలుపెట్టారు.
మరోపక్క ఆ హీరో.. తన లేటెస్ట్ మూవీలో నటించిన హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇది కాస్త తన భార్యకి తెలిసింది. దీంతో వీరి మధ్య మరింత దూరం పెరిగింది. ఇక వీళ్ళు కలిసే ఛాన్స్ లేదు. ఆ హీరో విడాకుల కోసం అప్లై చేద్దామంటే.. తన భార్య భరణం కోట్లల్లో డిమాండ్ చేస్తుందట. అసలే సినిమాలు లేవు.. ఆమెకు కోట్లల్లో భరణం ఎలా ఇవ్వాలా అని అతను కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు టాక్.