చిరు, చరణ్ లకు హ్యాండిచ్చిన స్టార్ డైరెక్టర్..!

  • November 7, 2019 / 06:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చేయడం వల్ల చాలా అలిసిపోయారు. అయినప్పటికీ కొంచెం గ్యాప్ తీసుకుని కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ సోషల్ మెసేజ్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నాడట. 6 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా పక్కా ప్లాన్ తో కొరటాల శివ రెడీ అయ్యాడట. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక సుకుమార్ డైరెక్షన్లో మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ ను రీమేక్ చేయాలని చిరు, చరణ్ లు ప్లాన్ చేశారట.

ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయినప్పటికీ.. ఇందులో సోల్ పాయింట్ ను తీసుకుని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మాస్ అంశాలు జోడించి సినిమాని రూపొందించాలని ప్లాన్ చేశారట. ‘కాటమరాయుడు’ ‘గద్దలకొండ గణేష్ (వాల్మీకి)’.. లా అన్న మాట. అయితే మొదట ఓకే చెప్పిన సుకుమార్.. ఇప్పుడు మాత్రం నో చెప్పాడట. రీమేక్ సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదని.. మెగాస్టార్ కోసం ఓ సొంత కథని రెడీ చేసుకుని వస్తానని.. చిరు, చరణ్ లకి చెప్పాడట. దీంతో చరణ్ ఇప్పుడు మరో దర్శకుడి కోసం వెతుకులాట మొదలుపెట్టాడని తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus