Star Heroes: టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఇదేనా?

  • August 18, 2023 / 01:11 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోల సినిమాలు ఈ సంవత్సరం విడుదల కాలేదు. ప్రభాస్, పవన్ సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా చరణ్, తారక్, మహేష్, బన్నీ సినిమాలు మాత్రం ఈ ఏడాది విడుదల కాలేదు. గతేడాది కూడా బన్నీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ విధంగా ఒక స్టార్ హీరో రెండు నుంచి మూడేళ్ల పాటు ఒకే సినిమాకు పరిమితం కావడం వల్ల ఈ హీరోల సినిమాల కౌంట్ తగ్గుతోంది.

రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ ఉండటం వల్ల ఆ సినిమాల రిజల్ట్ తేడా కొడితే హీరోల కెరీర్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. అందువల్ల స్టార్ హీరోలు వేగంగా సినిమాలలో నటించడంతో పాటు ఒకే సమయంలో కనీసం రెండు సినిమాలలో నటించేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. పాన్ ఇండియా మాయలో పడి స్టార్ హీరోలు ఒక సినిమాకే రెండు నుంచి మూడేళ్లు పరిమితం కావడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

టాలీవుడ్ స్టార్ హీరోలు (Star Heroes) చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఇదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ హీరోలు ఈ విషయంలో కొంత బెటర్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగార్జున మినహా ఈ ఏడాది మిగతా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ది ఘోస్ట్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగ్ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో సీజన్ 7 సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు కానుందని సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్ 6 ఫ్లాపైన నేపథ్యంలో సీజన్ 7 కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus