ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
April 10, 2021 / 04:08 PM IST
|Follow Us
ఓ హీరో ఎన్ని హిట్లు కొట్టినా, నటుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నా.. అతను స్టార్ హీరో అయ్యాక మాత్రం అతని పేరు ముందు ఎదో ఒక బిరుదు యాడ్ అవుతూ ఉంటుంది. అటు తరువాత ఆ హీరో పేరుని సంబోధించే ముందు ఆ బిరుదుని యాడ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు అలాగే ఆ హీరోల అభిమానులు. అయితే ఆ హీరోకి అప్పటివరకూ ఉన్న హిట్ల కంటే.. ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ పడితే కనుక పడితే ఇంకా పెద్ద బిరుదు లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ టాలీవుడ్లో చాలా మంది హీరోల బిరుదులు మారాయి. మరి ఆ హీరోలు ఎవరు? మొదట వాళ్ళు సంపాదించుకున్న బిరుదు ఏంటి? ఆ తరువాత వాళ్లకు లభించిన బిరుదు ఏంటి? అది ఏ సినిమాలతో? అనే వివరాలను ఓ లుక్కేద్దాం రండి :
1) కృష్ణ:
ఈయన కెరీర్ ప్రారంభంలో ‘నటశేఖర’ అనే బిరుదుని సంపాదించుకున్నాడు. అయితే.. మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న తరువాత ‘సూపర్ స్టార్’ అనే బిరుదు ఇతనికి లభించింది. ‘సింహాసనం’ సినిమా నుండీ ఈయన సూపర్ స్టార్ కృష్ణగా కొనసాగుతున్నారు.
2) చిరంజీవి:
మాస్ అనే పదానికి సరికొత్త డెఫినిషన్ చెప్పింది చిరంజీవి గారు. ఆయన డ్యాన్సులు, ఫైట్లతో అప్పటి ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసారు. అందుకే మొదట ఈయన పేరుకి ముందు డైనమిక్ హీరో అనే బిరుదు యాడ్ అయ్యింది. ఆ తర్వాత ‘సుప్రీమ్ హీరో’ అనే బిరుదుని సంపాదించుకున్నారు. అటు తరువాత అంటే ‘మరణ మృదంగం’ సినిమా నుండీ ఇతని పేరుకి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదు యాడ్ అయ్యింది. ఇప్పటికీ ఆయన మెగాస్టార్ గానే కొనసాగుతున్నారు.
3) నందమూరి బాలకృష్ణ:
మొదట ఈయనికి ‘యువరత్న’ అనే బిరుదు లభించింది. అయితే ‘సింహా’ తో ఈయన ‘నట సింహం’ అనే బిరుదుని సంపాదించుకున్నారు.
4) అక్కినేని నాగార్జున:
మొదట ఈయనికి ‘యువసామ్రాట్’ అనే బిరుదు లభించింది. తరువాత ‘రగడ’ మూవీ నుండీ ‘కింగ్’ అనే బిరుదు యాడ్ అయ్యింది.
5) మహేష్ బాబు:
మొదట ఈయనకి ‘ప్రిన్స్’ అనే బిరుదు లభించింది. అయితే ‘పోకిరి’ తరువాత ఈయన ‘సూపర్ స్టార్’ అయ్యాడు.
6) ప్రభాస్:
‘యంగ్ రెబల్ స్టార్’ అనే బిరుదు మొదట ప్రభాస్ కు లభించింది. అయితే పాన్ ఇండియా స్టార్ అయిన తరువాత ‘రెబల్ స్టార్’ అనే బిరుదు యాడ్ అయ్యింది.
7) రవితేజ:
మొదట ‘మాస్ హీరో’ అనే బిరుదు రవితేజ కు ఉండేది. అయితే ‘మిరపకాయ్’ నుండీ ‘మాస్ మహారాజ్’ అనే బిరుదు యాడ్ అయ్యింది.
8) ఎన్టీఆర్:
మొదట ‘యంగ్ టైగర్’ అనే బిరుదు ఎన్టీఆర్ కు ఉండేది. అయితే ‘శక్తి’ సినిమాతో ‘ఎ1 స్టార్’ బిరుదు యాడ్ అయ్యింది. కానీ ఇప్పటికీ ‘యంగ్ టైగర్’ గానే కొనసాగుతున్నాడు.
9) నరేష్:
‘అల్లరి’ అనే బిరుదు నరేష్ కు ఉండేది. అయితే ‘శుభప్రదం’ నరేష్ గా కె.విశ్వనాథ్ గారు మార్చారు. ఇక ఇప్పుడు ‘నాంది’ నరేష్ అనే బిరుదుని సంపాదించుకున్నాడు.
10) అల్లు అర్జున్:
మొన్నటి వరకూ స్టయిలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఇటీవల జరిగిన ‘పుష్ప’ టీజర్ లాంచ్ లో ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదుని బన్నీకి ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.