కరోనా దెబ్బకు…కొత్త మార్గాలు వెతుకుతున్న బడా నిర్మాతలు
June 28, 2020 / 07:58 PM IST
|Follow Us
కరోనా వైరస్ ప్రభావం చిత్ర పరిశ్రమను కుదేలు చేస్తుండగా…థియేటర్స్ యాజమాన్యాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా.. ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే సూచనలు కనిపించించడం లేదు. దీనితో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే అనేక చిన్న చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి వస్తున్నాయి. షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు నోచుకోని మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు.
ఇక అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు ఆహా అనే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేసి, సిరీస్ లు మరియు సినిమాలు నిర్మించి విడుదల చేస్తున్నారు. కాగా ఇదే మార్గంలో మరికొన్ని నిర్మాణ సంస్థలు నడవనున్నాయని తెలుస్తుంది. సొంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లేకున్నప్పటికీ సిరీస్ లు మరియు సినిమాలు నిర్మించి నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ వంటి వరల్డ్ ఫేమస్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి అమ్ముకోవాలని చూస్తున్నారట.
యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు డిజిటల్ కంటెంట్ పై దృష్టి సారించారని సమాచారం. దీనికోసం యంగ్ అండ్ సీనియర్ రచయితలు మరియు దర్శకులను సంప్రదించ వలసినదిగా కోరుతున్నారట. బెస్ట్ కంటెంట్ తక్కువ బుడ్జెత్ తో చిత్రాలు మరియు సిరీస్ లో నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.