Tollywood: టాలీవుడ్ నిర్మాతలు అలా చేస్తే మంచిదేమో!
July 18, 2022 / 04:50 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్ని సంవత్సరాలలో తమ రెమ్యునరేషన్లను ఊహించని స్థాయిలో పెంచేశారు. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మూవీలు ఖాతాలో ఉన్న యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారు. తమ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ హీరోల పారితోషికాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కో సినిమాకు భారీస్థాయిలో హీరోలు పారితోషికాలను తీసుకుంటుండగా ఇదే స్థాయిలో కలెక్షన్లు మాత్రం పెరగడం లేదు.
హీరోల పారితోషికాలలో సగం కూడా సినిమా సక్సెస్ కు కారణమైన దర్శకులు తీసుకోవడం లేదంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక సీనియర్ స్టార్ హీరో సినిమా రెమ్యునరేషన్లకే నిర్మాతలు ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా థియేట్రికల్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్లను 20 నుంచి 30 శాతం వరకు తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలతో నిర్మాతలు చర్చిస్తే మంచిదని చెప్పవచ్చు. అయితే ఒకసారి పెంచిన రెమ్యునరేషన్లను తగ్గించుకోవడానికి హీరోలు ఇష్టపడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి నిర్మాతలు రెమ్యునరేషన్లను తగ్గించాలని కోరితే హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఆగష్టు నెల 1వ తేదీ నుంచి షూటింగ్ లు ఆగే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. షూటింగ్ లు ఆగితే ఇండస్ట్రీపై ఆధారపడిన అందరిపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఓటీటీల వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.