2021,2022 లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ముఖ్యంగా 2022 సెకండాఫ్ లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించడం జరిగింది. కొంతమంది వయసు సంబంధిత సమస్యలతో, మరికొంతమంది అనారోగ్య సమస్యలతో, ఇంకొంతమంది అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. చివరి 4 నెలల్లో సీనియర్ మోస్ట్ నటీనటులు మరణించడం జరిగింది. ఇక ఈ 2023 లో అయినా అంతా బాగుంటుంది అనుకుంటే అప్పుడే ఓ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు.
కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నాడు ఉదయం కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. పెద్దాడ మూర్తి అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రాజీవ్ నరగ్లోని శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు మరియు ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారని సమాచారం. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన మూర్తి ఆ గేయ రచయితగా మారారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ తన ‘కూతురు’ సినిమాలో మూర్తితో ఓ పాటను రాయించారు.
అలా మూర్తిని రచయితగా పరిచయం చేసిన ఘనత ఆయనకే చెందింది. అటు తర్వాత సీరియళ్లకు కూడా మూర్తి పాటలు రాయడం జరిగింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’… అలాగే కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ వంటి హిట్ సినిమాలకు మూర్తి పాటలు రాశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుకుంటున్నారు.