టాలీవడ్ స్టార్స్ డ్రీం ప్రాజెక్ట్స్ ఇంకా నెరవేరలేదట…!

  • June 7, 2021 / 05:34 PM IST

ప్రతీ డైరెక్టర్ కి డ్రీం ప్రాజెక్ట్ అనేది ఒకటుంటుంది. అయితే దానిని తెరకెక్కించి సంతృప్తి చెందడం అనేది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కొంతమంది మాత్రమే తమ డ్రీం ప్రాజెక్టుని తెరకెక్కించగలరు. మరి కొంతమందికి అది స్క్రిప్ట్ దగ్గరో, ప్రీ ప్రొడక్షన్ దగ్గరో ఆగిపోతుంది. మన టాలీవుడ్ లో చాల మంది స్టార్ డైరెక్టర్లు ఇంకా తమ డ్రీం ప్రాజెక్టులను తెరకెక్కించలేకపోయారు. వాళ్ళెవరో.. వాళ్ళు తెరకెక్కించలేకపోయిన వారి డ్రీం ప్రాజెక్టులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కృష్ణవంశీ : రుద్రాక్ష

రమ్యకృష్ణ,అనుష్క,సమంత లతో ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల అది సెట్స్ పైకి వెళ్ళలేదు. అంతేకాదు బాలయ్యతో ‘రైతు’ అనే సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.

2) రాజమౌళి : మహాభారతం

జక్కన్న చాలా సార్లు చెప్పారు…’ ‘మహాభారతం’ ప్రాజెక్టుని తెరకెక్కించాలి అనేది తన డ్రీం ప్రాజెక్టు అని’..! కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

3) పవన్ కళ్యాణ్ : సత్యాగ్రహి

చాలా ముచ్చట పడి ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఎ.ఎం.రత్నం ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చారు. కానీ ‘జానీ’ రిజల్ట్ తో వెనక్కి వెళ్ళిపోయింది.

4) గుణశేఖర్ : హిరణ్యకసిప

రానా దగ్గుబాటితో ఈ ప్రాజెక్టు చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ దీనిని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి టైం పడుతుందని ఇటీవల ఆయన పుట్టినరోజు నాడు తెలియజేసారు. ప్రస్తుతం గుణశేఖర్.. సమంతతో ‘శాకుంతలం’ ను తెరకెక్కిస్తున్నారు.

5) పూరి జగన్నాథ్ : జన గణ మన

మహేష్ తో ఈ ప్రాజెక్టు చెయ్యాలి అనుకున్నారు పూరి. కానీ మహేష్ కు ఈ స్క్రిప్ట్ నచ్చలేదు. దీంతో వేరే హీరో కోసం గాలిస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించాలనేది పూరి డ్రీం.

6) త్రివిక్రమ్ : కోబలి

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మన మాటల మాంత్రికుడి డ్రీం. పవన్ కళ్యాణ్ తో అనుకున్నారు.. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు.

7) సుకుమార్ :

శ్రీలంక నుండీ బయలుదేరి, దారితప్పి ఆహారం, నీరు లేకుండా సుదీర్ఘ పడవ ప్రయాణం చేసి, తూర్పు గోదావరి జిల్లాకు చేరుకున్న మత్స్యకారుల ఇతివృత్తంలాంటి కథలను తెరకెక్కించాలని సుకుమార్ డ్రీం. కానీ, ఇటువంటి సినిమాలకు హిందీ చిత్రసీమలా అంతర్జాతీయ మార్కెట్ కావాలి. మనది హైదరాబాద్ మార్కెటే. కాబట్టి వెనకడుగువేసారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది కాబట్టి.. పునరాలోచనలో ఉన్నారు సుకుమార్.

8)క్రిష్ : పర్వ

ఇది మహాభారతం ను ఆధారం చేసుకుని రాసిన బుక్. భైరప్ప అనే రచయిత రచించాడు. దీనిని ఈ బుక్ ను ఆధారం చేసుకుని సినిమా తీయాలనేది క్రిష్ డ్రీం.

9)ఆర్జీవీ :

చిరు తో ‘దొర ది లార్డ్’ అనే సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ చిరు ఫ్యాన్స్ అంచనాలను మ్యాచ్ చెయ్యలేను అని పక్కన పెట్టారు.

10)కోడి రామకృష్ణ :

బాలకృష్ణతో ‘విక్రమ్ సింహా’ అనే భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేసారు. కానీ అది ఆగిపోయింది. ఆయనకు ఇది డ్రీం ప్రాజెక్టు అని చాలా సార్లు చెప్పారు. కానీ దానిని తెరకెక్కించకుండానే కన్ను మూసారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus