Home » Featured Stories » Tollywood Stars Impressed With Classy Look And Performance
మన హీరోల క్లాసీ హిట్స్
June 10, 2017 / 12:57 PM IST
హీరోలు మాస్ లుక్ తో ఉంటేనే తెలుగు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే మాస్, మసాలా కలిసిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. కమర్షియల్ సక్సస్ కోసం అటువంటి కథల్లోనే టాలీవుడ్ నటులు నటిస్తుంటారు. అరుదుగా క్లాస్ లుక్ తో కనిపిస్తుంటారు. అలా క్లాసీగా కనిపించి.. హిట్ అందుకున్న హీరోలు, ఆ సినిమాలపై ఫోకస్..
మహేష్ బాబు – దూకుడుపోలీస్ ఆఫీసర్ అంటేనే కొంత రఫ్ నెస్ ఉంటుంది. ఎక్కువమంది మీసం తిప్పి మాస్ లుక్ తోనే కనిపించారు. మహేష్ బాబు మాత్రం దూకుడు చిత్రంలో చాలా క్లాస్ గా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఎమ్మెల్యేగా కాసేపు కనిపించినా ఆ లుక్ కూడా సూపర్.
అల్లు అర్జున్ – సన్నాఫ్ సత్యమూర్తిసినిమాకి సినిమాకి స్టైల్ ని మార్చేస్తూ స్టైలిష్ స్టార్ అనే పేరుని సార్ధకం చేస్తున్న అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో రిచ్ క్లాస్ గా నటించి మంచి మార్కులు కొట్టేశారు.
నాగ చైతన్య – ఏ మాయ చేసావేయువ సామ్రాట్ నాగ చైతన్య ఎన్నో క్లాస్ రోల్స్ చేశారు. అయినప్పటికీ కెరీర్ మొదల్లో ఏమాయ చేసావే సినిమాలో కనిపించిన క్లాసీ లుక్ అందరికీ నచ్చింది. అందుకే చైతూకి ఘన విజయాన్ని అందించారు.
ప్రభాస్ – మిస్టర్ పర్ఫెక్ట్ఆరడుగుల అందగాడు ప్రభాస్ యమ క్లాస్ గా కనిపించిన మూవీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇందులో ప్రభాస్ హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అంత క్లాస్ గా ఉంటుంది.
నాగార్జున – మనంమాస్ సినిమాలో మ..మ .. మాస్ అన్నా, మన్మధుడులో క్లాస్ గా అదరగొట్టినా అది అక్కినేని నాగార్జునకే చెల్లింది. అయితే మనం సినిమాలో బిట్టు పాత్ర మాత్రం అందరి మదిలో ముద్రపడిపోయింది. అందుకు కారణం క్లాసీ లుక్.
శర్వానంద్ – మళ్లీ మళ్లీ ఇది రాని రోజుమళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ అథ్లెట్ గా కనిపించారు. క్రీడాకారుడి మనస్తత్వానికి భిన్నంగా చాలా కూల్ గా ఉంటాడు. మాటతీరు, నడవడిక క్లాస్ ప్రజలను మెప్పించింది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయినా శర్వానంద్ కి మంచి పేరు వచ్చింది.
నాని – ఎవడే సుబ్రహ్మణ్యంపక్కింటి కుర్రోడిలా కనిపించే నేచురల్ స్టార్ నాని లుక్ పై దృష్టి పెట్టడు. బయట ఎలా ఉంటే అలా కనిపించడానికి ఇష్టపడుతారు. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం లో మాత్రం క్లాసీ లుక్ తో అదరగొట్టారు.
ఎన్టీఆర్ – నాన్నకు ప్రేమతోమాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్. అతని సినిమాలో భారీ ఫైట్లు, లెన్త్ డైలాగులు ఉండాల్సిందే. అటువంటి హీరో పూర్తిగా చేంజ్ అయి చేసిన సినిమా నాన్నకు ప్రేమతో. ఇందులో తారక్ లుక్ హాలీవుడ్ హీరోని గుర్తుకు తెస్తుంది.
ధృవవరుస ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్ ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన మూవీ ధృవ. ఇందులో రామ్ చరణ్ లుక్ ఫెంటాస్టిక్. యువ ఐపీఎస్ ఆఫీసర్ గా మారిపోయి క్లాసీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.