టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే
June 23, 2020 / 08:06 PM IST
|Follow Us
కొన్ని కాంబినేషన్స్, కాన్సెప్ట్స్ అభిమానులలో భారీ అంచనాలు తీసుకొస్తాయి. ఆ సినిమాతో తమ హీరో రికార్డుల దుమ్ముదులపడం ఖాయం అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. తీరా విడుదలయ్యాక కనీస ఆదరణ దక్కించుకోలేక చతికల పడతాయి. భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డ స్టార్ హీరోల సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం…
అజ్ఞాతవాసి
2018 సంక్రాంతి కానుకగా వచ్చిన అజ్ఞాతవాసి పవన్ కెరీర్ లోనే భారీ నష్టాలు మిగిల్చింది. పవన్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అజ్ఞాతవాసి కాపీ వివాదాన్ని కూడా మూటగట్టుకొని ..త్రివిక్రమ్ కి చెడ్డ పేరుతెచ్చింది.
బ్రహ్మోత్సవం
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ని అఘాదంలో పడేసిన చిత్రం బ్రహ్మోత్సవం. మహేష్ హీరోగా, భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఆ చిత్రం కనీస ఆదరణ దక్కించుకోలేక మహేష్ చిత్రాలలో అత్యంత చెత్త చిత్రంగా నిలిచి, బయ్యర్లను ముంచేసింది.
శక్తి
ఎన్టీఆర్ తో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి టాలీవుడ్ బడా ప్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా భారీ నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాలు జాబితాలో చేరింది.
తుఫాన్
అమితాబ్ నటించిన ఆల్ టైం హిట్ జంజీర్ రీమేక్ గా చరణ్ చేసిన .. తుఫాన్ చరణ్ కెరీర్ లో అత్యంత చెత్త మూవీగా నిలిచింది. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదలై భారీ ప్లాప్ గా నిలిచింది.
రెబల్
వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో వచ్చిన రెబల్ ప్రభాస్ కి భారీ షాక్ ఇచ్చింది. కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఒక్క మగాడు
బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒక్క మగాడు ఒకటి. దర్శకుడు వై వి ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ మూవీ భారతీయుడు మూవీకి కాపీ అన్న అపవాదు మూటగట్టుకుంది. అలాగే భారీ పరాజయాన్ని ఎదుర్కొంది.
స్పైడర్
తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ మహేష్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాలలో ఒకటి. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ కనీస ఆదరణ దక్కించుకోలేక భారీ నష్టాలు మిగిల్చింది.
రుద్రమదేవి
భారీ చిత్రాల దర్శకుడు హీరోయిన్ అనుష్కతో రుద్రమదేవి మూవీ అనే భారీ పీరియాడిక్ మూవీ చేశారు. భారీ క్యాస్టింగ్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా డబ్బులు రాలేదు.
కొమరం పులి
ఖుషి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్ జె సూర్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన కొమరం పులి భారీ ప్లాప్ గా నిలిచింది. స్పష్టత లేని కథనం ప్రేక్షకుడికి పిచ్చెక్కించింది. మొత్తంగా భారీ నష్టాలు మిగిల్చింది.
అఖిల్
అక్కినేని వారసుడు అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ భారీ అంచనాల మధ్య వచ్చింది. వి వి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయం మూటగట్టుకొని..నష్టాలు మిగిల్చింది.