Krithi Shetty: కృతిశెట్టికి ఆమె గట్టి పోటీ ఇస్తోందా..?

  • May 10, 2021 / 11:17 AM IST

కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించినా స్టార్ హీరోయిన్లను మించి కృతిశెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ కు ముందే కృతిశెట్టికి సినిమా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాతో పాటు కృతిశెట్టి నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో, రామ్ లింగు స్వామి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు హిట్టై కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే ఇతర భాషల్లో సైతం ఆమె బిజీ అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ హీరోయిన్ కు మరో హీరోయిన్ గట్టి పోటీని ఇస్తున్నారు. యంగ్ హీరోయిన్ కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ హీరోయిన్ కు కూడా సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకముందే నాగశౌర్య హీరోగా నటిస్తున్న లక్ష్య సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఇద్దరు హీరోయిన్లకు కొత్త సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందన్నా మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి, కేతిక శర్మ మధ్య కూడా అదే స్థాయిలో పోటీ నెలకొంది. ఉప్పెన హిట్ తో కృతిశెట్టి పై చేయి సాధించినా కేతిక శర్మ నటిస్తున్న సినిమాలపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ హీరోయిన్లలో రాబోయే రోజుల్లో ఎవరు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus