‘కె.జి.ఎఫ్ 2’ టు ‘కాంతార’… ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్..!
December 20, 2022 / 03:39 PM IST
|Follow Us
కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సినిమాలు ఇంకా ఒకదాని వెనుక ఇంకోటి అన్నట్టు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు… ఇలా నెలకు ఎంత కాదనుకున్నా 30 నుండి 50 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. అయితే అందులో కనీసం 4,5 సినిమాలు కూడా హిట్ అవ్వడం లేదు. 2022 లో హిట్ పర్సెంటేజ్ బాగా తగ్గింది. ప్రమోషనల్ కంటెంట్ బలంగా ఆకట్టుకుంటేనే కానీ జనాలు థియేటర్ కు రావడం లేదు.
ఇదే క్రమంలో డబ్బింగ్ సినిమాలు ఈ ఏడాది మంచి ఫలితాలను అందుకున్నాయి. బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు యూనివర్సల్ ఆడియన్స్ అన్న సంగతి తెలిసిందే. టాక్ బాగుంటే ఏ సినిమానైనా సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెడతారు. అందుకే ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా బాగా కలెక్ట్ చేశాయి. మరి అందులో టాప్ 10 ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :
యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ రూ.74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.84.5 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది.
2) డాన్(2022) :
శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా శిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.1.96 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ మూవీగా నిలిచింది.
3) విక్రమ్ :
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రూ.7.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఈ మూవీ ఫుల్ రన్లో రూ.17 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) విక్రాంత్ రోణ :
సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.1.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.4.05 కోట్ల షేర్ ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
5) బ్రహ్మాస్త్రం :
రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.12.62 కోట్ల షేర్ ను రాబట్టి తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
6) పొన్నియన్ సెల్వన్ :
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగులో రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.9.76 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ మూవీగా నిలిచింది.
7) కాంతార :
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.27.97 కోట్ల షేర్ ను రాబట్టి.. ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
8) సర్దార్ :
కార్తి హీరోగా నటించిన ఈ మూవీ రూ.4.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.7.77 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9) లవ్ టుడే :
ప్రదీప్ రంగనాథన్ నటించి, డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.2.35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.7 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది
10) అవతార్ 2 :
జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫస్ట్ వీకెండ్ కే రూ.23.35 కోట్ల షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తూనే ఉంది.