‘గోవిందా గోవిందా’ టు ‘అంజి’.. ఈ 10 ఫాంటసీ సినిమాలు బాగుంటాయి.. కానీ ఫ్లాప్ అయ్యాయి
July 3, 2024 / 07:55 PM IST
|Follow Us
గతంలో ఒకసారి అల్లు అర్జున్ ఓ మాట అన్నాడు. ‘నా సినిమా ప్లాప్ అయినా పర్వాలేదు. కానీ అందమైన సినిమా ప్లాప్ అవ్వాలి. చూడటానికి అది అందంగా ఉండాలి.. అలాంటి సినిమా ప్లాప్ అయినా నేను బాధపడను’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. అతని మాటలు అర్ధంకాక గందరగోళానికి గురయ్యి కొంతమంది ఆ కామెంట్స్ ని విమర్శించారు. కానీ అతని ఉద్దేశం వేరు. ‘సినిమా ఫలితం అనుకున్నట్టు వచ్చినా రాకపోయినా.. ఆ సినిమా కథ డిమాండ్ చేసినట్లు తను బెస్ట్ ఇచ్చి అందంగా తయారు చేసి ఉండాలి. అది తన బాధ్యత. ఫలితం అనేది జనాల చేతిలో ఉంటుంది. తన చేతిలో ఉండదు’ అనే అర్థం కోసం అల్లు అర్జున్ పలికిన మాటలు అవి.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే..! ఏ సినిమా అయినా అందరికీ నచ్చని రూల్ ఏమీ లేదు. సినిమా ఫలితం ఎప్పుడూ ఆశించినట్టు ఉండదు. కానీ కొన్ని సినిమాలు బాగున్నా.. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన సందర్భాలు గతంలో చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇంకా కొన్ని సినిమాలు సో సోగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకి, ఫాంటసీ జోనర్ లో రూపొందిన సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) ఆ జోనర్లో రూపొందిన సినిమానే..! అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకి అక్కడక్కడా ఫాంటసీ టచ్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). అది బాగా వర్కౌట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ‘కల్కి…’ కాసుల వర్షం కురిపించాడు ముఖ్య కారణం అదే. ఈ మధ్య ఇలాంటి సినిమాలు బాగా వస్తున్నాయి. గతంలో కూడా కొన్ని సినిమాలు ఫాంటసీ జోనర్లో రూపొందాయి. కానీ బాక్సాఫీస్ వద్ద అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ఇది. నాగార్జున (Nagarjuna) , శ్రీదేవి (Sridevi) హీరో, హీరోయిన్లుగా నటించారు. అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మాత. రాజ్ (Thotakura Somaraju) – కోటి (Saluri Koteswara Rao) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన సెటప్ అంతా కలిగి ఉన్న సినిమా ఇది. కానీ 1994 లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత టీవీల్లో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ ఆశ్చర్యపోయారు. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయ్యింది అని ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు.
2) కన్నయ్య కిట్టయ్య :
రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) డబుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఫాంటసీ కామెడీ జోనర్లో రూపొందింది. రేలంగి నరసింహారావు దర్శకుడు. 1993 లో వచ్చిన ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
3) మగరాయుడు :
స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఫాంటసీ టచ్ తో రూపొందిన కామెడీ మూవీ. కార్తీక్ (Karthik) హీరో. విజయశాంతి (Vijayashanti) హీరోయిన్. టీవీల్లో చూడటానికి ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
4) మెకానిక్ మావయ్య :
రాజశేఖర్ (Rajasekhar) , రంభ (Rambha) జంటగా నటించిన ఈ సినిమాలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) కీలక పాత్ర పోషించారు. ఇది కూడా ఓ ఫాంటసీ ఎలిమెంట్ తో రూపొందింది. షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే చేశారు. ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకుడు. రామోజీరావు (Ramoji Rao) నిర్మాత. 1999 లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ టీవీల్లో అయితే ఒకసారి చూసే విధంగానే ఉంటుంది.
వెంకటేష్ (Venkatesh Daggubati), సౌందర్య (Soundarya) , అంజలా జావేరి (Anjala Zaveri)… ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది. కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకుడు.ఎం.ఎస్.రాజు (M. S. Raju) నిర్మాత. 2001 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్లే ఈ సినిమా ప్లాప్ అయ్యింది అని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ కచ్చితంగా వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే దీని ఫలితం మరోలా ఉండేది అని నమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
2006 లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. రాజా (Raja Abel), భూమిక (Bhumika Chawla) జంటగా నటించిన ఈ సినిమా కూడా ఫాంటసీ టచ్ తో రూపొందింది. ఒకసారి చూసే విధంగానే ఉంటుంది. కానీ ఆ టైంకి ప్లాప్ అయ్యింది.
8) బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం :
శివాజీ (Sivaji) హీరోగా సోనియా (Sonia Deepti) హీరోయిన్ గా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఫాంటసీ టచ్ తో రూపొందింది. 2010 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ.. ఎందుకో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
ఈ టైటిల్ విన్నా, చదివినా.. ‘ఇది ఓ మాస్ మూవీ… కచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ నిండుగా ఉంటాయి’ అనే థాట్ తోనే ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్తాడు. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబో నుండి ఆశించేవి కూడా అవే..! కానీ దీనికి ఫాంటసీ జోడించి తీశాడు దర్శకుడు. ‘సినిమా జోనర్ ఏంటి?’ అనే విషయంపై జనాలకి అవగాహన కల్పించకుండా.. వారిపై వదిలేయడం వంద శాతం దర్శకుడి తప్పే. అందుకే బాక్సాఫీస్ ఫలితం తేడా కొట్టింది. కానీ టీవీల్లో ఈ సినిమాని జనాలు ఎక్కువగానే చూశారు.
నాగార్జున (Nagarjuna) , అనుష్క (Anushka Shetty) జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. సినిమా ఫాంటసీ ఎలిమెంట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్.. చాలా సార్లు వాయిదా పడటం.. తర్వాత సడన్ గా రిలీజ్ అవ్వడం వల్ల అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది అనే చెప్పాలి. కానీ ఒకసారి చూసే విధంగానే ఈ మూవీ ఉంటుంది.