ఈ ఏడాది గూగుల్ సెర్చ్ టాప్ టెన్‌లో ఎన్ని తెలుగు సినిమాలున్నాయంటే..?
December 12, 2022 / 08:00 AM IST
|Follow Us
ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది.. కంటెంట్ బాగుంటే బాషతో సంబంధం లేకుండా చూస్తున్నారు.. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో మరో మెట్టు పైకి ఎక్కించారు.. ట్రిపులార్ జపాన్, ‘పుష్ప’ రష్యా లాంటి దేశాల్లో విడుదలై సందడి చేస్తున్నాయి.. టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో పాగా వేస్తోంది.. ఈ 2022లో సాలిడ్ బ్లాక్ బస్టర్స్, రికార్డ్ క్రియేట్ చేసిన మూవీస్ వచ్చాయి.. అలాగే నెటిజన్లు గూగుల్‌లో ఏ ఏ సినిమాలను ఎక్కువగా సెర్చ్ చేశారో.. వాటి తాలూకా టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది గూగుల్.. వాటిలో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.. ఏ సినిమాల గురించి జనాలు ఎక్కువగా సెర్చ్ చేశారో ఆ వివరాలు (టాప్ 10 నుండి 1 వరకు) ఇప్పుడు చూద్దాం..
10. థోర్ : లవ్ అండ్ థండర్..
ఈ ఏడాది ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన లిస్టులో నిలిచిన ఒకే ఒక్క హాలీవుడ్ మూవీ.. ‘థోర్ : లవ్ అండ్ థండర్’..
9. దృశ్యం 2..
మెహన్ లాల్ నటించిన సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా ‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ (మలయాళం) 9వ స్థానంలో ఉంది..
8. లాల్ సింగ్ చద్దా..
ఆమిర్ ఖాన్, కరీనా కపూర్.. నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ‘లాల్ సింగ్ చద్దా’ 8 ప్లేస్‌లో ఉండడం విశేషం..
7. విక్రమ్..
విశ్వ నటుడు కమల్ హాసన్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఫిలిం ‘విక్రమ్’.. కథ, కథనాలు, క్యారెక్టర్లు, యాక్షన్ సీన్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం..
6. పుష్ప..
2021 డిసెంబర్ 17న రిలీజ్ అయిన ‘పుష్ప – ది రైజ్’.. 2022లో కూడా గూగుల్ టాప్ ట్రెండింగ్‌లో ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది..
పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటి.. ఇప్పుడు రష్యాలోనూ విడుదలైంది..
5. కాంతార..
‘కె.జీ.ఎఫ్’ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి చరిత్ర సృష్టించింది ‘కాంతర’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది.. కర్ణాటక ప్రజల సంసృతి, సాంప్రదాయలను రిషబ్ శెటి చూపించిన విధానానికి, అతని నటనకి అంతా మంత్ర ముగ్దులయ్యారు.. రూ. 16 కోట్లతో తెరకెక్కి, రూ. 400 కోట్లు కొల్లగొట్టిన ‘కాంతార’ టాప్ 5లో చోటు దక్కించుకుంది..
4. ఆర్ఆర్ఆర్..
పాన్ వరల్డ్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ట్రిపులార్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు నెలకొల్పింది..
3. కశ్మీర్ ఫైల్స్..
1990 ప్రాంతంలో జమ్ము, కాశ్మీర్‌లోని కశ్మీరీ పండితుల కథకు తెర రూపమిచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’.. మౌత్ టాక్ తర్వాత పెద్ద విజయం సాధించింది..
2. కె.జీ.ఎఫ్ : చాప్టర్ 2..
‘కె.జీ.ఎఫ్ : చాప్టర్ 1’ తర్వాత అంతకుమించి రికార్డ్స్ సాధించింది ‘కె.జీ.ఎఫ్ : చాప్టర్ 2’.. ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అతి పెద్ద విజయం సాధించింది.. రూ. 1250 + కోట్ల కలెక్షన్లతో కన్నడ నాట హయ్యస్ట్ గ్రాసర్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది..
1. బ్రహ్మాస్త్ర..
రణ్ బీర్, ఆలియా భట్, మౌనీ రాయ్, అమితాబ్, నాగార్జున, షారుఖ్ ఖాన్ (అతిథి పాత్ర) నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఆలియా, శివ ట్రోల్స్ తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించడం విశేషం.. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా రూ. 500 + కోట్లకు పైగా కలెక్ట్ చేసింది..