2023 Rewind: ఈ ఏడాది సక్సెస్ సాధించిన 10 మంది డెబ్యూ డైరెక్టర్ల లిస్ట్
January 4, 2024 / 01:05 PM IST
|Follow Us
ప్రతి ఏడాది కొత్త దర్శకులు ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా అని కొత్త దర్శకులంతా సక్సెస్ సాధిస్తారు అని చెప్పలేం. తమ కంటెంట్ తో ప్రేక్షకులను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. 2023 లో కూడా చాలా మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఇంప్రెస్ చేసి సక్సెస్ లు అందుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. లిస్ట్ లో ఉన్న టాప్ 10 డెబ్యూ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) షణ్ముఖ ప్రశాంత్ :
సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు షణ్ముఖ్ ప్రశాంత్. మొదటి సినిమాతోనే అతను ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ కూడా అందుకున్నాడు.
2) మురళి కిషోర్ అబ్బూరు :
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు మురళి కిషోర్ అబ్బూరు.ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్..లతో బాగా ఎంగేజ్ చేశాడు. ఈ సినిమా కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ..లు జంటగా నటించిన ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దిండి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
నాగ శౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు పవన్ బాసంశెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కానీ.. డైరెక్షన్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇతనికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
6) శ్రీనివాస్ వింజనం పాటి :
సోహెల్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్‘ అనే డిఫరెంట్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్ వింజనం పాటి. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సో సోగా ఆడినా.. ఇతనికి మంచి మార్కులే పడ్డాయి.
7) క్లాక్స్ :
‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక – 2012‘ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు క్లాక్స్. తొలి సినిమాతో ఇతను బాగానే ఆకట్టుకున్నాడు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
8) కళ్యాణ్ శంకర్ :
‘మ్యాడ్‘ అనే సినిమాతో ఇతను దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ కి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న‘ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు (Shouryuv) శౌర్యువ్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో అతను టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు.
10) సాయి కిరణ్ దైదా :
ఇటీవల వచ్చిన ‘పిండం’ అనే హారర్ మూవీతో ఇతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.దర్శకుడు సాయి కిరణ్ దైదా టేకింగ్ కూడా అందరినీ మెప్పించింది.