టాలీవుడ్ లో టాప్ టెన్ యంగ్ డైరక్టర్స్

  • October 29, 2016 / 05:54 AM IST

డైరక్టర్ అంటే సినిమా అనే నావకు కెప్టెన్ వంటి వారు. అతనికి ప్రతిభతో పాటు ప్రతిభ ఉన్నవారిని గుర్తించగల నేర్పు ఉండాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో దాగిన ట్యాలెంట్ ని వెలికి తీసే గుణం ఉండాలి. నలుగురితో కలిసిపోయే తత్వం ఉండాలి. 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. ఇంత నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే గతంలో డైరక్టర్ చైర్ లో కూర్చోవాలంటే కనీసం పది సంవత్సరాల పాటు సినిమా మేకింగ్ లో అనుభవం ఉండాలి. అప్పుడే నిర్మాతలు వారికి అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక సినిమాకు కూడా దర్శకత్వశాఖలో పనిచేయకుండానే నేరుగా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. నేటి యువత నాడిని పట్టి బాక్స్ ఆఫీస్ ని కొల్లకొడుతున్నారు. అలా టాలీవుడ్ లో విజయాలను అందుకున్న టాప్ టెన్ యంగ్ డైరక్టర్స్ వీరే.

1. చందూ మొండేటి (కార్తికేయ, ప్రేమమ్)2. అనిల్ రావిపూడి (పటాస్, సుప్రీమ్)3. శ్రీనివాస్ అవసరాల (ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద)4. సుజీత్ (రన్ రాజా రన్ )

5. మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా)6. సుధీర్ వర్మ (స్వామి రారా)7. హను రాఘవపూడి – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ8. రవికాంత్ పెరెపు (క్షణం)9. కార్తీక్ ఘట్టమనేని (సూర్య వర్సెస్ సూర్య)10. నాగ్ అశ్విన్ (ఎవడే సుబ్రహ్మణ్యం)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus