2023 Rewind: ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు వెబ్ సిరీస్..లు
January 3, 2024 / 11:10 AM IST
|Follow Us
ఓటీటీల హవా మునుపటి కంటే పెరిగింది. ఒకప్పుడు ధియోటర్స్ లో మాత్రమే సినిమాలు నేరుగా రిలీజ్ అయ్యేవి. కానీ ఓటీటీలు వచ్చాక వినోదం ఇంటికే వచ్చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా జనాలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్.. లను కూడా ఎగబడి చూస్తున్నారు. 3 గంటల్లో చెప్పడానికి వీలు లేని కథని, 4,5 గంటల్లో చెప్పడమే వెబ్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ హిందీ చిత్ర పరిశ్రమ వెబ్ సిరీస్ అంటే బెడ్ రూమ్ సీన్లు, లిప్ లాక్..లు, గ్లామర్ కే పెద్ద పీట వేయాలి అన్నట్టు దాని అర్దం మార్చేసాయి. అలా అని అక్కడ మంచి వెబ్ సిరీస్.. లు, రాలేదా? అంటే వచ్చాయి. కానీ ఎక్కువ శాతం కంటెంట్ కంటే గ్లామర్ కే ఎక్కువ పెద్ద పీట వేశాయి అని చెప్పాలి.
అయితే తెలుగు దర్శకులు కూడా వెబ్ సిరీస్..లను తీస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి సక్సెస్.. అయితే వాళ్ళకి పాన్ ఇండియా వైడ్ మంచి పేరు వస్తుంది. 2023 లో కూడా కొన్ని మంచి వెబ్ సిరీస్.. లు వచ్చాయి. ఇందులో కొన్ని ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాయి. మరి ఆ వెబ్ సిరీస్.. లు ఏంటో , ఒకసారి చూద్దాం రండి:
1) ఎ.టి.ఎమ్ :
బిగ్ బాస్ 5 విన్నర్ , విజె సన్నీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. హరీష్ శంకర్ ఈ సిరీస్ కి ఒక నిర్మాత కావడం విశేషం
2) సేవ్ ది టైగర్స్ :
టాప్ డైరెక్టర్ మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ కూడా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ తో కలిసి చూడతగ్గ వెబ్ సిరీస్ ఇది.
3) కుమారి శ్రీమతి :
నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను మెప్పించింది
4) దయ :
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. పవన్ సాధినేని దీనికి దర్శకుడు.
5) అతిధి :
సీనియర్ హీరో వేణు నటించిన ఈ హార్రర్ వెబ్ సిరీస్ కూడా బాగానే అలరించింది
6) మాన్షన్ హౌస్ :
ఓంకార్ డైరెక్షన్లో రూపొందిన ఈ హార్రర్ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను మెప్పించింది
7) న్యూ సెన్స్ :
నవదీప్ లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది
8) రానా నాయుడు :
రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ తో వెంకటేష్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. జనాలు తిట్టుకున్నప్పటికీ ఈ సిరీస్ ను బాగానే చూశారు
9) వ్యూహం :
ఇటీవల వచ్చిన ఈ వెబ్ సిరీస్ కూడా మంచి మార్కులు వేయించుకుంది
10) దూత :
నాగచైతన్య, విక్రమ్ కుమార్ కలియకలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ (Dhootha) కూడా చాలా బాగుంటుంది.