Tollywood Folk Songs: టాలీవుడ్లో దుమ్ము దులిపిస్తున్న 4 ఫోక్ సాంగ్స్ ఏంటో తెలుసా?

  • August 9, 2021 / 03:16 PM IST

ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైంది.సినీ ప్రియులకి క్లాస్ మ్యూజిక్ చాలా బోర్ కొట్టేసింది.ఈ డైలాగ్ అనడానికి రీజన్ కూడా ఈ పాటికి మీకు అర్ధమైపోయుంటుంది. ఇప్పుడు టాలీవుడ్ అంతా ఫోక్ పై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కాలంలో చార్ట్ బస్టర్ అయిన పాటల్లో చాలా వరకు ఫోక్ సాంగ్స్‌ ఉండడం విశేషం.ఈ పాటలు సినిమాల పై బోలెడెంత హైప్ జెనరేట్ అయ్యేలా చేస్తున్నాయి. అలా విడుదలైన పాటలకు కూడా యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతుండటం విశేషం. ఆ పాటలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’.త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్ ప్రోమోని ఇటీవల విడుదల చేశారు.‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే ఈ పాట పాత ఫోక్ సాంగ్ కు రీమిక్స్ కావడం విశేషం. ఈ పాట తెగ ట్రెండ్ అవుతుండడం విశేషం.

2) సుధీర్ బాబు హీరోగా ‘పలాసా’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో ‘మందులోడా’ అనే ఫోక్ సాంగ్ ను రీమిక్స్ చేశారు. మణిశర్మ సంగీతంలో రూపొందిన ఈ పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

3) గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీటీ మార్’ మూవీలో కూడా ‘జ్వాలా రెడ్డి’ అనే పాట ఉంది. తెలంగాణ పాపులర్ ఫోక్ సాంగ్ ‘పోరు తెలంగాణ’ స్ఫూర్తి తో ఇది రూపొందింది.

4) ఇక ‘లవ్ స్టోరీ’ మూవీలో ‘సారంగ దరియా’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇది కూడా ఓ ఫోక్ సాంగ్ కు రీమిక్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల దృష్టి కూడా పడడానికి ఈ పాట ముఖ్య కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇవి మాత్రమే కాదు గతంలో వెంకటేష్ నటించిన ‘బాబు బంగారం’ లో ‘యంకటేసో.. దగ్గుబాటి బాసో’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ లో ‘దిగు దిగు భామ ఈ ప్రేమ లోతెంతొ చూద్దామా’ అనే పాటలు కూడా ఫోక్ సాంగ్స్ స్ఫూర్తితో రూపొందినవే..!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus