సుమ నుండీ అనసూయ వరకూ.. యాంకర్ల పారితోషికాలు ఎంతెంతంటే..?
August 18, 2020 / 08:27 PM IST
|Follow Us
టీవీ షోస్ బాగా సక్సెస్ అవ్వాలంటే.. ఆ షో కాన్సెప్ట్ బాగుండడంతో పాటు.. దానిని హోస్ట్ చేసే యాంకర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ను తన యాంకరింగ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటున్నట్టు యాంకరింగ్ అంటే.. అంత ఈజీ ఏమీ కాదు. స్పాంటేనియస్ గా మాట్లాడాల్సి ఉంటుంది. దానికి చాలా ట్యాలెంట్ అవసరం. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టు సింక్ అయ్యేలా ప్రవర్తించాలి. ఎదుటి వారి ఎమోషన్స్ ను బట్టి కూడా ఆధారపడి ప్రశ్నలు అడుగుతుండాలి. మరి అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఆషామాషీ విషయం ఏమీ కాదు.
అయితే మన తెలుగులో మాత్రం చాలా మంది ట్యాలెంటెడ్ యాంకర్లు ఉన్నారు. బుల్లితెర పై షోల నుండీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అలాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కు యాంకర్ల అవసరం చాలా ఉంటుంది. మరి వీటికి వాళ్ళు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది.వారి మేకప్ ఖర్చులు, టీ, టిఫిన్, జ్యూస్.. వంటి ఖర్చులు కాకుండానే వీరి పారితోషికం ఉంటుంది. వీరికి ఈవెంట్ లేదా ఎపిసోడ్ ను బట్టి పారితోషికాన్ని చెల్లిస్తుంటారు. మరి ఒక్కో ఎపిసోడ్ కు.. ఏ యాంకర్ ఎంతెంత పారితోషికం అందుకుంటారో తెలుసుకుందాం రండి :