కొంచెం బయటపడింది కానీ… దాచేసింది..!

  • May 27, 2019 / 04:42 PM IST

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. ప్రస్తుతం తెలుగులో అయితే ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు కానీ తమిళంలో మాత్రం ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు అలాగే కథా ప్రాధాన్యత ఉండే చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది త్రిష. ‘రాంగి’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కథ అందిస్తున్నాడు. శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇక ‘రాంగి’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది త్రిష. ఇక ఈ తన అభిమానులతో సరదాగా ముచ్చటించింది కూడా. ఈ క్రమంలో ఓ నెటిజెన్ ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు త్రిష చెప్పిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. త్రిష సమాధానమిస్తూ.. ‘ఎలాంటి రిలేషన్స్ లేవు. కానీ ఓ వ్యక్తి నుండీ ప్రేమ పొందుతున్నా’ అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చింది త్రిష. 2015లోనే త్రిష వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంది. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నికారణాల వల్ల ఆమె నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. మరి ఈసారి త్రిష ఎవరి ప్రేమలో ఉందా అనేదే… చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus