Trivikram: నువ్వే నువ్వే సినిమానీ సిరివెన్నెలకు అంకితం ఇచ్చిన త్రివిక్రమ్!
October 12, 2022 / 11:58 AM IST
|Follow Us
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఆయన రచయితగా కాకుండా దర్శకుడిగా పరిచయమైనది మాత్రం నువ్వే నువ్వే సినిమాతోనే.ఈ సినిమా సోమవారానికి విడుదల 20 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో ప్రత్యేకంగా ఏఎంబి థియేటర్లో ఈ సినిమా స్పెషల్ షో వేశారు. ఈ షోలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. స్రవంతి రవి కిషన్ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా శ్రీయ తరుణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హీట్ అయింది.
ఇక ఈ క్రమంలోనే చిత్ర బృందం మరోసారి ఈ సినిమా విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.రచయితగా ఉన్న తనని దర్శకుడుగా పరిచయం చేసిన రవి కిషోర్ గారికి ఎన్నిసార్లు నేను కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. రచయితగా తాను నువ్వే కావాలి సినిమా కథ అందించాను. ఈ సినిమా షూటింగ్ వనమాలి హౌస్ లో జరుగుతుండగా పక్కనే ఉన్నటువంటి స్థలంలో నేను రవి కిషోర్ గారు అలా నడుస్తూ ఉన్నాము
ఆ సమయంలోనే రవి కిషోర్ గారికి తాను నువ్వే నువ్వే సినిమా కథ చెప్పానని ఈ కథ విన్న వెంటనే రవి కిషోర్ గారు చెక్ బుక్ తీసి తనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. నువ్వే కావాలి సినిమాకి రచయితగా తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నానో నువ్వే నువ్వే సినిమాకు కూడా తనకు అంత అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. అయితే ఈ డబ్బుతో తాను బైక్ కొనుక్కున్నానని త్రివిక్రమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా త్రివిక్రమ్ రవి కిషోర్ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా తన పాదాలకు నమస్కారం చేశారు.
తనలో ఉన్న దర్శకుడిని గుర్తించిన ఘనత ఆయనదేనని ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపిన తక్కువేనంటూ వెల్లడించారు. ఈ సినిమాలో పాటలు అందించినటువంటి గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కూడా గుర్తు చేసుకున్నారు. గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి ఏం చెప్పగలము. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఈయన మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా మా సినిమాని ఆయనకు అంకితం చేస్తున్నామంటూ ఈ సినిమాని సిరివెన్నెలకు అంకితం ఇచ్చారు.