అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కథ ఇదేనా?

  • January 2, 2019 / 12:46 PM IST

“బ్రతికున్నప్పుడే నాన్నల్ని ప్రేమిద్దాం” అని “సన్నాఫ్ సత్యమూర్తి” ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలు ఇప్పటికీ చాలామంది మనసుల్లో నిలిచిపోయే ఉంటాయి. అందుకే.. తన సినిమాల్లో నాన్న పాత్రలకు మంచి వెయిట్ ఇస్తుంటాడు త్రివిక్రమ్. “సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ణాతవాసి” చిత్రాల్లో తండ్రి పాత్రలు చాలా హుందాగా ఉంటాయి. ఇక “అరవింద సమేత” సినిమాను మొదలెట్టాడమే తండ్రి సెంటిమెంట్ తో ప్రారంభించాడు త్రివిక్రమ్.

తన కొత్త సినిమాకు కూడా అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకే అల్లు అర్జున్ తో తాను తెరకెక్కించనున్న తాజా సినిమా కథను కూడా తండ్రి క్యారెక్టర్ చుట్టూనే అల్లుకొన్నాడట. అల్లు అర్జున్ కి కూడా విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. మరి ఈసారి మన త్రివిక్రముడు తండ్రీకొడుకుల బంధాన్ని ఎంత కొత్తగా, హృద్యంగా చూపించనున్నాడో చూడాలి. ఏమైనా కొన్ని బంధాలను త్రివిక్రమ్ తెరకెక్కించినంత అందంగా, అద్భుతంగా మరెవరూ చూపించలేరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus