Rana, Trivikram: రానాను సోలో స్టార్‌ను చేయడానికి ఆ సినిమానే…!

  • December 12, 2022 / 08:08 PM IST

టాలీవుడ్‌లో చాలా రోజులుగా చర్చల్లో ఉన్న సినిమాల లిస్ట్‌ తీస్తే.. అందులో ‘హిరణ్య కశ్యప’ కచ్చితంగా ఉంటుంది. చాలామంది నోట చాలా సార్లు వినిపించిన ఈ సినిమా.. అక్కడి నుండి ముందుకు రావడం లేదు. అలా అని సినిమా పూర్తిగా పక్కన పెట్టేశారా అంటే లేదనే చెప్పాలి. ఇదిగో, అదిగో అంటున్నారు తప్ప స్టార్ట్‌ చేయడం లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర సమాచారం ఒకటి బయటికొచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమాను గుణశేఖర్‌ చేస్తారనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కాదంటున్నారు.

అనుష్కతో ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేతమైన సినిమా తీసిన గుణశేఖర్‌ దర్శకత్వంలోనే ‘హిరణ్య కశ్యప’ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. ‘రుద్రదమదేవి’ సినిమానకు మించిన భారీత‌నంతో ఈ సినిమాను తీయాలనుకున్నారాయన. అయితే సొంత ప్రొడ‌క్ష‌న్లో కాకుండా సురేష్ బాబు నిర్మాణంలో సినిమా చేయ‌డానికి గుణ‌శేఖ‌ర్ రెడీ అయిన సంగ‌తీ తెలిసిందే. దాదాపు రెండేళ్లు గుణ‌శేఖ‌ర్, సురేష్ బాబు ఈ ప్రాజెక్టు కోసం క‌లిసి ప్ర‌యాణం సాగించారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి వేరే డైరక్టర్‌ వస్తున్నారు.

రానాను సోలో స్టార్‌ హీరోగా చూడటానికి సుమారు రూ.200 కోట్ల భారీ ఖ‌ర్చుతో సినిమా తీయ‌డానికి సురేష్ బాబు దిగారు. గుణ‌శేఖ‌ర్ కొన్నేళ్ల పాటు ఈ క‌థ రీసెర్చ్, స్క్రిప్టు ప‌నులు చేశారు కూడా. అయితే గుణ‌శేఖ‌ర్ ఇంతలో ‘శాకుంత‌లం’ సినిమా వైపు వెళ్లిపోయారు. దీంతో ‘హిరణ్య కశ్యప’ ఇక ఆగినట్లే అనుకున్నారు. బ‌డ్జెట్ సినిమాల‌కే ప‌రిమితమవుతున్న సురేష్ బాబు.. అంత బ‌డ్జెట్ పెట్టి రిస్క్ చేయ‌లేక వెన‌క్కి తగ్గారేమో అనుకున్నారు.

కానీ సురేష్ బాబు ‘హిర‌ణ్య క‌శ్య‌ప’ సినిమా గురించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకు వేరే దర్శకుడు పని చేస్తారని చెప్పారు. హిర‌ణ్య క‌శ్య‌ప‌కు మారతారేమో అనుకుంటే.. ఏకంగా దర్శకుడు మారుతున్నారు. గుణశేఖర్‌కి బదులు ఈ సినిమాను త్రివిక్రమ్‌ రూపొందిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటారు అని ఓ టాక్‌ నడుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus