తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినీ దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తెలుగువారి ఇళ్లల్లోని అనుబంధాలను కథ వస్తువుగా తీసుకొని ఈయన అద్భుత చిత్రాలను తీశారు. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ సినిమాకు మీనా సినిమా స్ఫూర్తి అని ఎవరికీ చెప్పకుండా రిలీజ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ మచ్చ ఆయనపై పెద్ద ప్రభావమే చూపింది. మాటల మాంత్రికుడు మెగా ఫోన్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏ చిత్రానికి కాపీ అంటూ కొంతమంది విమర్శకులు ఆరా తీయడం మొదలెట్టారు. త్రివిక్రమ్ మాటలు అందించిన, డైరక్ట్ చేసిన సినిమాల్లోని కొన్ని సీన్లు ఇతర భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాల నుంచి కాపీ కొట్టినట్లు తెలిసింది. అవి ఏమిటంటే.. త్రివిక్రమ్ డైరక్టర్ గా కాకముందు చిరునవ్వుతో(2000) మూవీకి కథ, మాటలు అందించారు. ఇందులోని కొన్ని కామెడీ సీన్లు 1997 లో వచ్చిన ఇటాలియన్ ఫిల్మ్ “లా విటా ఈ బెల్లా(లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ )” అనీ మూవీలోనుంచి కాపీ కొట్టారు.
వేణు హాట్ కొట్టేసే సీన్లు, ఎల్ బీ శ్రీరామ్ తో నిద్రపోవడం ప్రాక్ట్స్ అయ్యే సీన్ యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారు. ఇక తన దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీలో అల్లు అర్జున్ విలన్ ని ఛేజ్ చేసే టప్పుడు ఒక భవనంలో ఇటు వైపు నుంచి అటువైపు వెళ్ళిపోతారు. ఈ యాక్షన్ సీన్ హాలీవుడ్ మూవీ “లాతేల్ వెపన్ 4 ” మూవీలోనుంచి ఎత్తేసారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ఖలేజాలో ప్రకాష్ రాజు చెరుకు నుంచి తయారు చేసిన స్ట్రాంగ్ ప్లాస్టిక్ గురించి వివరించే సన్నివేశం మొత్తం 1954 లో రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం సబ్రిన నుంచి కాపీ కొట్టారు. ఇంకా మీకు అనుమానం ఉంటే ఆ చిత్రాల వీడియో చూడండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.