హీరోలను అజ్ఞాతవాసాని పంపడం త్రివిక్రమ్ కి అలవాటైపోయింది
February 21, 2020 / 01:46 PM IST
|Follow Us
దర్శకుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో పోగొట్టుకున్న గుర్తింపు అల వైకుంఠపురంలో మూవీతో రాబట్టుకున్నారు. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ విజయం త్రివిక్రమ్ ని మళ్ళీ హాట్ ఫెవరేట్ దర్శకుడిగా మార్చింది. అందుకే ఎన్టీఆర్ తన కోసం ఎదురుచూస్తున్న టాప్ డైరెక్టర్స్ ని కాదని తన 30వ సినిమా మళ్ళీ త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు. దీనిపై నిన్న అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ‘అయిననూ హస్తినకు పోయిరావలె’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే కనుక టైటిల్ అయితే త్రివిక్రమ్ మళ్ళీ తన హీరోని ఓ ఇంటికో ప్రాంతానికి పంపడానికి సిద్ధం అవుతున్నాడని అనుకోవడమే. హీరోలను అజ్ఞాతవాసానికి పంపడం త్రివిక్రమ్ కి అలవాటైపోయింది. అన్ని సినిమాలలో అది ఆయనకు కామన్ పాయింట్ అయ్యింది.
ఆయన దర్శకుడిగా పనిచేసిన మొదటి చిత్రం నువ్వే నువ్వే మినహా ఇస్తే రెండవ చిత్రం అతడు నుండి ఆయన ఇదే ఫార్ములా వాడేస్తున్నాడు. అతడు లో క్రిమినల్ మహేష్ ని బాసర్లపూడి ఉమ్మడి కుటుంబంలోకి పంపాడు. జల్సాలో నక్సల్ పవన్ కళ్యాణ్ ని జనజీవన స్రవంతిలో కలిపి ఇలియానా లవర్ ని చేశారు. ఖలేజాలో డ్రైవర్ మహేష్ ని రాజస్థాన్ పంపించాడు. ఇక అత్తారింటికి దారేది సంగతి తెలిసిందే. ఇటలీ నుండి సంపన్నుడైన అల్లుడు అత్త కోసం ఇండియా వస్తాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీని ఉపేంద్ర ఇంటికి పంపాడు. అ ఆ సినిమాలో మాత్రం హీరోకి బదులు హీరోయిన్ సమంతను మేనమామ ఇంటికి పంపాడు. ఇక అజ్ఞాతవాసి లో పవన్, అరవింద సమేతలో ఎన్టీఆర్ కూడా అజ్ఞాతవాసం చేశారు . లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో బన్నీ, టబు ఇంటికి వెళతాడు.ఇలా కెరీర్ ప్రారంభం నుండి త్రివిక్రమ్ ఒకే ఫార్ములా అన్ని సినిమాలకు వాడేస్తున్నాడు.