Trivikram: బన్నీ – త్రివిక్రమ్‌ – బాలీవుడ్ హీరో మల్టీస్టారర్‌ రెడీనా?

  • February 23, 2023 / 03:17 PM IST

అల్లు అర్జున్‌ స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా? చాలా రోజుల నుండి బన్నీ బాలీవుడ్‌ సినిమా అంటున్నారు తప్ప.. ఎక్కడా అలాంటి ప్రయత్నాలు సీరియస్‌గా కనిపించడం లేదు. అంటే అక్కడి కథలు వినడం, అక్కడి దర్శకులను కలవడం లేదు.. మరి బాలీవుడ్‌ సినిమా ఎలా అనిపించడమే ఆ డౌట్‌కి కారణం. అయితే ఇప్పుడు దానికి దాదాపుగా ఆన్సర్‌ దొరికింది. అదే త్రివిక్రమ్‌. అవును గురూజీనే. అయితే అది సింగిల్‌ హీరో సినిమా కాదు, మల్టీస్టారర్‌ అని అంటున్నారు.

చాలా రోజుల క్రితం అంటే ‘జెర్సీ’ సినిమా ప్రచారం సమయంలో అల్లు అరవింద్‌ ముంబయిలో ఓ మాట మాట్లాడారు. ‘ఇప్పుడు బన్నీ గురించి ఎందుకు, ఆ విషయం మాట్లాడితే అసలు విషయం పక్కకెళ్లి ఆ విషయం బయటకొస్తుంది’ అని. దాంతో బన్నీ బాలీవుడ్‌ ప్రయత్నాలు సాగుతున్నాయి అని తేలిపోయింది. అయితే డైరక్టర్‌ ఎవరు అనే విషయం మాత్రం తేలలేదు. ఆ డైరక్టర్‌ త్రివిక్రమ్ అని లేటెస్ట్‌గా పుకార్లు వస్తున్నాయి. అలా ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్‌ ఫ్లైట్‌ ఎక్కుతారన్నమాట.

మహేష్‌బాబు సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ ఓ సినిమా చేస్తారని చాలా రోజుల నుండి న్యూస్‌ వస్తోంది. అయితే ఎక్కడా అఫీషియల్‌గా సమాచారం లేదు కానీ.. వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమానే పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ అని అంటున్నారు. మహేష్‌ సినిమా అయ్యేలోపు తన టీమ్‌ ఈ మేరకు ఓ కథ సిద్ధం చేస్తారని టాక్‌. ఇద్దరు ఫ్రెండ్స్‌ మధ్య సాగే ఎమోషన్‌ మూవీగా ఈ సినిమా ఉండబోతోందని టాక్‌.

పాన్‌ ఇండియా అంటున్నారు, బాలీవుడ్ అంటున్నారు.. ఆ రెండో హీరో ఎవరు అనేగా డౌట్‌. ఇంకెవరు మన సినిమాల్ని బాలీవుడ్‌కి తీసుకెళ్లి రీసెంట్‌గా హిట్లు కొట్టిన షాహిద్‌ కపూరే. ఈ ముగ్గురు కలయికలోనే ఈ సినిమా ఉంటుందని టాక్‌. అయితే ఎప్పుడు అనేది మాత్రం తెలియడం లేదు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus