తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే అయినా సౌత్ లోనూ బాగా పాపులర్ అయ్యింది కత్రినా కైఫ్. మొదట్లో ఆమెకు డ్యాన్స్ రాదని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ఆమెను ఒన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్ అని పొగుడుతుండడం ఆమె ఎదుగుదలకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె రీసెంట్ గా నటించిన “భరత్” సినిమా ట్రైలర్ మొన్న విడుదలైంది. ఆ సినిమాలో ఆమెకు చెప్పిన ఓ డైలాగ్ ను ఇప్పుడు ట్రోల్స్ కోసం కాస్త గట్టిగానే వాడుతున్నారు. ఈమధ్యకాలంలో కత్రినా చెప్పిన పెద్ద డైలాగ్ ఇదేనని ఆమెను ట్రోల్ చేయడంతోపాటు బోలెడన్ని మీమ్స్ కూడా చేశారు.
అయితే.. కత్రినా ఆ ట్రోల్స్ ను మీమ్స్ చాలా సరదాగా తీసుకొండనుకోండి. కొన్ని మీమ్స్ కు తన కూడా లైక్ చేయడం ఇంకొన్నిట్నీ షేర్ చేయడం వంటివి ఆమె ఆ మీమ్స్ ను ఎంత స్పోర్టివ్ గా తీసుకోంది అనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన ఈ చిత్రం జూన్ లో విడుదలవుతుండగా.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. కత్రినా చాలాకాలం తర్వాత మళ్ళీ అక్షయ్ కుమార్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకోనుండడం విశేషం. కత్రినా స్పీడ్ చూస్తుంటే.. ఆమె కెరీర్ అయిపోయింది అనుకొన్నవాళ్లందరికీ గట్టి సమాధానమే ఇచ్చినట్లుంది.