Niharika: నెట్టింట్లో మరోసారి ట్రోల్ అవుతున్న మెగా డాటర్!
May 13, 2022 / 07:02 PM IST
|Follow Us
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన నిహారిక అనంతరం ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమై పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక వెబ్ సిరీస్ ను నిర్వహిస్తూ నిర్మాతగా మారారు. ఇలా పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన తనతో కలిసి నిహారిక చేసిన ఒక వీడియోని పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ వీడియో వివాదాలకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ వీడియోపై నెటిజన్ లు దారుణంగా ట్రోలింగ్ చేయగా నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. అలాగే ఈ వివాదం ముగిసిపోకముందే పబ్ ఈ వ్యవహారంతో పోలీసులకు దొరికిపోయారు. ఇలా పబ్ వ్యవహారం కారణంగా నిహారిక పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇక ఈ విషయం నుంచి బయటపడిన నిహారిక ఇంస్టాగ్రామ్ రీ ఎంట్రీ ఇచ్చి యధావిధిగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. నిహారిక ప్రస్తుతం తన భర్తతో కలిసి జోర్దాన్ ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు..ఈ క్రమంలోనే ఒక ఫోటోని షేర్ చేస్తూ తాను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోని చూసి పలువురు ఈమె పై ప్రశంసలు కురిపించగా మరికొందరు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ ఇంకొకసారి దొరికితే తప్పకుండా స్వర్గం కనిపిస్తోంది లే అంటూ దారుణంగా కామెంట్ చేశారు. మరికొందరు ఆ ఫోటోలో ఉన్న పిల్లర్ లాగా నువ్వు కూడా ధైర్యంగా ఉండాలని కామెంట్ చేశారు. మొత్తానికి నిహారిక షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.