తనతో బ్రేకప్ గురించి రష్మిక ఫియాన్సీ స్టేట్మెంట్

  • September 11, 2018 / 01:28 PM IST

“ఛలో, గీత గోవిందం” చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకోవడానికంటే ముందే రష్మిక బాగా ఫేమస్. కన్నడలో “కిరాక్ పార్టీ”తో విశేషమైన ఫాలోయింగ్ తోపాటు క్రేజ్ కూడా సంపాదించుకొన్న రష్మిక మండన్నా.. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ పాపులారిటీని పదింతలు చేసుకొంది. అయితే.. “కిరాక్ పార్టీ”లో నటించిన తర్వాత ఆ చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకొన్న రష్మిక ఒక రెండేళ్లు గ్యాప్ కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ మీద కాన్సన్ ట్రేట్ చేసిన రష్మిక ఇక్కడ వరుస విజయాలతోపాటు ఆఫర్లు కూడా క్యూ కట్టడంతో కన్నడ పరిశ్రమను పట్టించుకోవడం మానేసింది.

అయితే.. ఈమధ్యకాలంలో రష్మిక-రక్షిత్ శెట్టిల వివాహం రద్దయ్యిందని వార్తలొచ్చినప్పటికీ.. వాటిని రక్షిత్ శెట్టి ఖండించాడు. అయితే.. నిన్న కన్నడ పాపూలర్ న్యూస్ పేపర్ అఫీషియల్ గా ప్రకటించేయడంతో కర్ణాటకలో మాత్రమే కాక ఆంధ్ర-తెలంగాణాల్లోనూ రష్మిక గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడడమే కాక బూతులు తిట్టడం మొదలెట్టారు. దాంతో స్పందించిన రక్షిత్ శెట్టి “దయచేసి రష్మికను తప్పుగా అర్ధం చేసుకోకండి, నేను సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్నాను” అంటూ ఒక పెద్ద లెటర్ పోస్ట్ చేశాడు. దాంతో నిన్నమొన్నటివరకూ వీరిద్దరి బ్రేకప్ పై ఉన్న కన్ఫ్యూజన్ పోయి ఇద్దరూ విడిపోయారనే విషయంలో క్లారిటీ మాత్రం వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus