‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్‌దీప్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

  • December 12, 2022 / 05:47 PM IST

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన అమర్ దీప్ చౌదరి ‘జానకి కలగనలేదు’ సీరియల్లో నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఓ డబ్బింగ్ సీరియల్ కు రీమేక్ గా ఈ సీరియల్ రూపొందింది.గతంలో ‘ఈతరం ఇల్లాలు’ పేరుతో స్టార్ మా లోనే ఓ సీరియల్ ప్రసారమయ్యేది. దానినే మళ్ళీ తెలుగు నేటివిటీకి తగినట్టు ‘జానకి కలగనలేదు’ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి ఈ సీరియల్ లో నటిస్తుంది కాబట్టి మొదటి నుండి ఈ సీరియల్ పై క్రేజ్ నెలకొంది.

అమర్‌దీప్‌ పాత్ర ఈ సీరియల్ లో హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక అమర్ దీప్ కు ఈ మధ్యనే ‘ కోయిలమ్మ’ ఫేమ్ తేజస్విని గౌడ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి డేట్ దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు కూడా ఘనంగా నివహిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరోపక్క తేజస్విని గౌడ.. తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అమర్ దీప్ ను కూడా కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకును చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమర్ దీప్ ను అభినందించేవారు.. అలాగే అతని ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus