అదే ప్లాప్ సినిమాని ఎన్ని సార్లు టెలికాస్ట్ చేస్తారు…!
April 23, 2020 / 05:56 PM IST
|Follow Us
ఓ అరడజను ప్లాప్ ల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో బయటపడ్డాడు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించారు. ఈ చిత్రం తర్వాత ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం చేసాడు.ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తేజ్ తరువాతి సినిమాల పై కూడా మంచి బజ్ ఏర్పడుతుంది.కెరీర్ కొంచెం గాడిలో పడింది అని ఆనందపడుతున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ వారి వల్ల మళ్ళీ తన క్రేజ్ కు దెబ్బ పడుతుందేమో అని సాయి తేజ్ భయపడుతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడున్న లాక్ డౌన్ నేపధ్యంలో … సీరియల్స్ షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి.దీంతో సీరియల్స్ ను మళ్ళీ మొదటి నుండీ టెలికాస్ట్ చెయ్యడం.. మిగిలిన టైం లో సినిమాలు టెలికాస్ట్ చేసి మ్యానేజ్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు.ఈ క్రమంలో ఓ ఛానల్ వారు సాయి తేజ్ … అట్టర్ ప్లాప్ సినిమాల్లో ఒకటైన ‘తిక్క’ ను వారంలో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేస్తున్నారట. ఆ సినిమా షూటింగ్ ‘సుప్రీమ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కంటే ముందే ఫినిష్ అయినా… ప్రివ్యూ చూసిన బయ్యర్స్ కొనుగోలు చెయ్యడానికి ఇష్టపడలేదు.
‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం తర్వాత తేజ్ మార్కెట్ కాస్త పెరగడంతో … ‘తిక్క’ సినిమా విడుదలకు నోచుకుంది. అయితే ప్రేక్షకులు , క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ఏకి పారేశారు. తేజు స్టోరీ సెలక్షన్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి సినిమాని మళ్ళీ టెలికాస్ట్ చెయ్యడం… దాని వల్ల తన కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందేమో అని సాయి భయపడుతున్నాడట.