సురేష్ బాబు మీటింగ్స్ లైట్ తీసుకున్నారా..?

  • July 28, 2022 / 07:02 PM IST

టాలీవుడ్ లో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ లో దగ్గుబాటి సురేష్ ఒకరు. నిర్మాతగానే కాకుండా ఎగ్జిబిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్స్ ఉన్న వారిలో సురేష్ బాబు ఒకరు. దగ్గుబాటి ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న హడావిడిలో సురేష్ బాబు ఎక్కడా కనిపించడం లేదు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో సురేష్ బాబు కూడా ఒక మెంబరే.

కానీ బయటకు వస్తోన్న వార్తల్లో కానీ.. కమిటీల్లో కానీ ఆయన పేరు వినిపించడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతల మండలి, టాలీవుడ్ గిల్డ్ రెండు వర్గాలుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ గిల్డ్.. షూటింగ్స్ బంద్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం కూడా నిర్మాతల మండలికి ఇష్టం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సురేష్ బాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ప్రశ్న. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పడం సురేష్ బాబు స్టైల్.

అలాంటిది ఈ బంద్ నిర్ణయానికి సంబంధించి ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. సురేష్ బాబు కావాలనే గిల్డ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని టాక్. సురేష్ బాబుతో పాటు ఏషియన్ సునీల్ కూడా ఈ మీటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. కమిటీలో ఆయన పేరు కూడా ఎక్కడా కనిపించడం లేదు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus