Ugram Collections: ‘ఉగ్రం’.. 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • May 10, 2023 / 08:34 PM IST

‘నాంది’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా కూడా చేశాడు. అది మంచి సినిమా అనిపించుకుంది కానీ మంచి సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ అనే చిత్రం చేశాడు. ఇది పక్కా యాక్షన్ మూవీ. మే 5న ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకులకు మరో కొత్త అల్లరి నరేష్ ను పరిచయం చేసిందని చెప్పాలి. ఇక రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి వీకెండ్ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది.వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.87 cr
సీడెడ్ 0.34 cr
ఉత్తరాంధ్ర 0.29 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.12 cr
గుంటూరు 0.18 cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.52 cr (షేర్)

‘ఉగ్రం’ (Ugram) చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.52 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించలేకపోతుంది అనే చెప్పాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus