బిగ్ బాస్ హౌస్ లో హైడ్రామాకి కొదవేలేదు. ఒకటనుకుంటే మరొకటి జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ సీజన్ నుంచీ ఎలిమినేషన్స్ అనేవి చాలా నాటకీయంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 2వ వారం నామినేషన్స్ లో ఉన్న ఉమాదేవి ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అసలు ఉమాదేవి ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అంటూ ఇప్పుడు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ లో నిజానికి సేఫ్ లో ఉన్న ఉమాదేవి చాలా నాటకీయంగా ఎందుకు ఎలిమినేట్ అయ్యిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నామినేషన్స్ లో విశ్వతో జరిగిన ఆర్గ్యూమెంట్ లో నాగార్జున సార్ ఇచ్చిన ఆలూ కర్రీ షేరింగ్ విషయంలో ఉమాదేవి రెచ్చిపోయి మరీ మాట్లాడింది. ఇక్కడే వల్గర్ లాంగ్వేజ్ సైతం మాట్లాడింది. ఆతర్వాత అనీమాస్టర్ ఆమెని ఇమిటేట్ చేస్తుంటే ఇరిటేట్ అయ్యింది. అంతేకాదు, అనిమాస్టర్ పై పెయింట్ పూసిన తీరు, కాజల్ ఫోటో చింపిన తీరు కూడా హౌస్ మేట్స్ ఎవ్వరికీ నచ్చలేదు. ఉమాదేవి ఇంకా నామినేషన్స్ అప్పుడు చెప్పిన రీజన్స్ అలాగే వాళ్లని ఇమిటేట్ చేయడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం ఇలా కొన్ని కారణాల వల్ల ఎలిమినేట్ అయ్యిందని రీజన్స్ చెప్తున్నారు బిగ్ బాస్ లవర్స్.
అంతేకాదు, ఉమాదేవి ప్రత్యేకించి ఫిజికల్ టాస్క్ వచ్చినపుడు కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేసింది. ప్రియాంకని కిందకి పారేసింది. ఇలా తనకి నచ్చిన స్టైల్లో గేమ్ ఆడుతోందని కూడా సోషల్ మీడియాలో కొన్ని కంప్లైట్స్ వినిపించాయి. బహుశా అందుకే బిగ్ బాస్ టీమ్ ఉమాదేవిని ఎలిమినేట్ చేసిందని చెప్తున్నారు. మరో మేటర్ ఏంటంటే మిస్డ్ కాల్ డేటా ఆధారంగా ఉమాదేవి అందరికంటే లీస్ట్ లో ఉందని కూడా బిగ్ లీక్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో సెకండ్ వీక్ కరాటే కళ్యాణి ఎలాగైతే హౌస్ లో నుంచీ బయటకి వచ్చేసిందో ఇప్పుడు సేమ్ టు సేమ్ సిమిలర్ గా అలాగే ఉమాదేవి కూడా హౌస్ లో నుంచీ వచ్చేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అదీ మేటర్.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!