బన్నీ-కొరటాల సినిమా.. అప్డేట్ రానుందా..?

  • March 1, 2021 / 04:03 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ సమయానికి సినిమాని రెడీ చేయడమే సుకుమార్ ముందున్న పెద్ద టాస్క్. గతంలో మాదిరి కాకుండా సుకుమార్ నాన్ స్టాప్ గా అసలు గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

మారేడుమిల్లిలో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. అక్కడ నుండి కేరళకి వెళ్లారు. ఆ తరువాత తమిళనాడుకి కూడా వెళ్లారు. ఇలా వేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. అలానే హైదరాబాద్ లో కూడా ఓ షెడ్యూల్ ప్లాన్ ఉంది. ఇదిలా ఉండగా.. పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నాయి. ఇప్పుడు సుకుమార్ ఆగస్టు నెలను వదులుకుంటే రిలీజ్ డేట్ సమస్య ఏర్పడుతుంది. అందుకే దర్శకుడు సుకుమార్ పై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నాడట హీరో అల్లు అర్జున్.

తన తదుపరి సినిమా విడుదల తేదీని ప్రకటించాలని బన్నీ ఆలోచిస్తున్నాడట. బన్నీ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. నిజానికి ఇంకా ఈ సినిమా కథ సిద్ధంగా లేదు. కానీ బన్నీ మాత్రం 2022 వేసవికి సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఏదైనా మంచి రోజు చూసి ఈ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే సుకుమార్ పై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus