ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ సినిమా 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన శ్రీయా రెడ్డి మంచి మార్కులు కొట్టేసింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే..! అంతేకాదు..
ఈమె ఇండియన్ క్రికెటర్ కూతురు అని కూడా ఎక్కువ మందికి తెలిసుండదు. అవును ఈమె ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు. ఒకప్పుడు భరత్ రెడ్డి అనే ఇండియన్ క్రికెటర్ ఉండేవారు. దినేష్ కార్తీక్ వంటి క్రికెటర్లకి అతను శిక్షణ ఇవ్వడం జరిగింది. అతను కూతురే శ్రీయా రెడ్డి. తెలుగులో ఈమె 2003 లో ‘ఆనంద్’ ఫేమ్ రాజా హీరోగా వచ్చిన ‘అప్పుడప్పుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అమ్మ చెప్పింది అనే సినిమాలో కూడా నటించింది.
కానీ ఈమెకి (Sriya Reddy) బ్రేక్ ఇచ్చిన మూవీ విశాల్ నటించిన ‘పొగరు’ అనే చెప్పాలి. ఆ సినిమాలో లేడీ విలన్ గా కనిపించి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ‘సలార్’ మూవీలో రాధా రామ అనే పాత్రలో బాగా నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!