చిరంజీవిని ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా మార్చిన 38 ఏళ్ల ‘దొంగ’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు..!
March 14, 2023 / 09:14 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి – ఎ. కోదండ రామి రెడ్డి.. సెన్సేషనల్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. చిరు కెరీర్ని మలుపు తిప్పిన సాలిడ్ ఫిలిం ‘ఖైదీ’ తర్వాత వీరి కలయికలో సూపర్ డూపర్ మూవీస్ వచ్చాయి.. ‘కొండవీటి దొంగ’ బిగ్గెస్ట్ సక్సెస్ అనంతరం ‘దొంగ’ అనే యాక్షన్ డ్రామా చేశారు. చిరు – రాధ జంటగా వచ్చిన ఈ మూవీ 1985 మార్చి 14న విడుదలైంది.. 2023 మార్చి 14 నాటికి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..
ఈ సందర్భంగా ‘దొంగ’ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించగా.. రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, గొల్లపూడి, సిల్క్ స్మిత, రాజ్య లక్ష్మీ, పూర్ణిమ, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, చలపతి రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. ‘వియత్నాం వీడు’ సుందరం కథ – స్క్రీన్ప్లే, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు.. VSR స్వామి కెమెరా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేశారు..
‘దొంగ’ గా మారి పేదలకు సాయం చేసే ఫణి (చిరంజీవి) తన తండ్రిని చంపినందుకు కోదండ రామయ్య (రావు గోపాల రావు)పై పగ తీర్చుకోవాలనుకుంటాడు.. అతడి కూతురు మంజులత (రాధ) తో ప్రేమలో పడతాడు.. తన చెల్లెలు మాలతి (రాజ్య లక్ష్మి) పెళ్లికి కట్నం కోసం రూ. 50 వేలు అవసరం అవుతుంది.. పలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఫణి ఎలా సక్సెస్ అయ్యాడనేది కథ.. ‘దొంగ’ లో అన్ని రకాల ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉండడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. చిరంజీవి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు..
వేటూరి పాటలు రాయగా.. ఎస్పీ బాలు, పి. సుశీల, ఎస్. జానకి పాడారు.. కె. చక్రవర్తి సంగీతమందించిన పాటలన్నీ ప్రజాదారణ పొందాయి.. ‘గోలీమార్’ సాంగ్ పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ స్ఫూర్తి.. చిరు బ్రేక్ డ్యాన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్సింగ్ స్టైల్ చూసి అంతా ఫిదా అయ్యారు.. ఈ మూవీ నుండే ఆయనను ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా అభివర్ణించడం మొదలు పెట్టారు..