Devi Putrudu Movie: 21 ఏళ్ళ ‘దేవీ పుత్రుడు’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
January 13, 2022 / 01:09 PM IST
|Follow Us
2000 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘కలిసుందాం రా’ … అదే ఏడాది అక్టోబర్లో వచ్చిన ‘జయం మనదేరా’ చిత్రం సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్లో ఉన్నాడు విక్టరీ వెంకటేష్. మరోపక్క ‘ఆవిడే శ్యామల’ ‘దేవుళ్ళు’ వంటి హిట్లు కొట్టి ఫామ్లో ఉన్నాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ‘దేవి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ అధినేత యం.యస్.రాజు. వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘శత్రువు’ అనే సూపర్ హిట్ మూవీ కూడా వచ్చి ఉంది.
మరి అలాంటప్పుడు వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇండస్ట్రీ రికార్డులు కొట్టడమే బ్యాలన్స్ అన్నట్టు విడుదల తేదీ రానే వచ్చింది. అనుకున్నట్టుగానే 2001 వ సంవత్సరం జనవరి 13న ‘దేవీపుత్రుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు విడుదలకి ముందే సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఆ పాటలు ఎక్కడా వినిపించలేదు.
సినిమాకి యం.యస్.రాజు గారు డబ్బుని మంచి నీళ్ళు ఖర్చుపెట్టినట్టు ఖర్చుపెట్టారు అని ప్రతీ విజువల్ చెబుతుంది.2001 లో టెక్నాలజీ ఏమాత్రం అభివృద్ధి చెందని ఆరోజుల్లో ఆ గ్రాఫిక్స్ ను ఎలా ప్రెజెంట్ చేసాడో కోడి రామకృష్ణ.. ఎవ్వరికీ అర్ధం కాదు. ఇన్ని హైలెట్స్ ఉన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం కథనాన్ని ఆసక్తిగా నడపలేకపోవడం వల్లనేనా.. లేక ‘దేవీ పుత్రుడు’ రాంగ్ టైములో విడుదలవ్వడం వల్లనా అంటే..
ఇప్పటికీ దానికి జవాబు దొరకడం లేదు. ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే రూ.14 కోట్ల బడ్జెట్ పెట్టారు రాజు గారు. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం రూ.140 కోట్ల పైనే అనుకోవచ్చు.బుల్లితెర పై మాత్రం ఈ చిత్రాన్ని చూసి బాగుందనే బ్యాచ్ కూడా ఉన్నారు. ‘దేవీపుత్రుడు’ కి పోటీగా విడుదలైన చిరంజీవి ‘మృగరాజు’ కూడా డిజాస్టర్ కాగా బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.