Kondaveeti Donga: 33 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ గురించి ఆసక్తికర విషయాలు..!
March 10, 2023 / 11:09 AM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 1980’s, 90’s లో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.. చిరు స్టార్‌డమ్‌ని పెంచిన, తెలుగు సినిమాని సత్తాని చాటిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.. వాటిలో మెగా మాసివ్ కాంబినేషన్ అయిన చిరు – స్టార్ డైరెక్టర్ ఎ. కోదండ రామి రెడ్డిల కలయికలో వచ్చిన సినిమా ‘కొండవీటి దొంగ’ కూడా ఒకటి.. 1990 మార్చి 9న రిలీజ్ అయిన ఈ మెగా మాసివ్ సూపర్ హిట్ ఎంటర్టైనర్ 2023 మార్చి 9 నాటికి 33 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..
సుప్రీం హీరో చిరు – విజయ శాంతి, రాధ ప్రధాన పాత్రధారులుగా.. కైకాల, అమ్రిష్ పురి, రావు గోపాల రావు, మోహన్ బాబు వంటి భారీ తారాగణంతో, విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. త్రివిక్రమ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కథ – మాటలు, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్‌ప్లే అందించారు.. వేటూరి, సిరివెన్నెల (చమక్ చమక్ చాం) పాటలు రాశారు..
అప్పట్లో ‘కొండవీటి దొంగ’ ఓ సెన్సేషన్.. ఇప్పడు చూసినా ఫ్రెష్ ఫీల్, థ్రిల్ కలుగుతుంది.. చిరు ‘కొండవీటి దొంగ’ గా మారి.. రాబిన్ హుడ్ తరహాలో.. అక్రమార్కుల బారినుండి అడవి తల్లిని, ఆ అడవినే నమ్ముకుని బ్రతికుతున్న గిరిజనులను కాపాడడం కథ అని క్లుప్తంగా చెప్పినా కానీ ప్రతి సన్నివేశం ఆద్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది.. మెగాస్టార్ నటన, ఆయన మార్క్ మేనరిజమ్స్, డైలాగ్స్, డ్యాన్స్ అండ్ ఫైట్స్, హీరోయిన్ల గ్లామర్‌తో పాటు క్యారెక్టర్లు అలరిస్తాయి.. ‘అబ్రక దబ్ర’ అంటూ అమ్రిష్ పురి ఊతపదం ఇప్పటికీ వినిపిస్తుంటుంది..
ఆ టైంలో 70 MMలో 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ టెక్నాలజీతో వచ్చిన తొలి చిత్రం ‘కొండవీటి దొంగ’.. ‘మ్యాస్ట్రో’ ఇళయ రాజా సాంగ్స్ ఎవర్ గ్రీన్ అసలు.. ‘ జీవితమే ఒక ఆట.. సాహసమే పూ బాట’, ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’, ‘చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో’, ‘కోలో కోలమ్మ గళ్ల కోకే’, ‘శ్రీ ఆంజనేయం’ పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్, కెమెరా, ఆర్ట్ వర్క్ కూడా ‘కొండవీటి దొంగ’ చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.. బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపిస్తూ రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది.. తమిళంలో ‘తంగమలై తిరుడన్’, మలయాళంలో ‘కొండనాడు కల్లాన్’ పేరుతో డబ్ చేయగా మంచి విజయం సాధించింది..