‘బిగ్ బాస్’ సీజన్ 6 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. మొదటి వారం షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మొదటిరోజే కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దీంతో కోల్డ్ వార్ మొదలైంది. సరే ఈ విషయాలను కాసేపు పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్ 6’ లో జనాలకు తెలియని కొన్ని కొత్త మొహాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. అందులో శ్రీ సత్య కూడా ఒకరు. ‘బిగ్ బాస్ 6’ లో ఈమె 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం :
1) ఈమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య, 1997 జూన్ 29న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జన్మించింది.
2) శ్రీ సత్య విధ్యాబ్యాసం అంతా విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుండి ఈమెకు నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే మోడల్ గా మారింది. ‘మిస్ విజయవాడ’ టైటిల్ ను గెలుచుకుంది. అటు తర్వాత ‘మిస్ ఆంధ్రప్రదేశ్’ టైటిల్ ను కూడా గెలుచుకుంది.
3) రామ్ హీరోగా తన సొంత బ్యానర్ ‘శ్రీ స్రవంతి మూవీస్’ లో రూపొందిన ‘నేను శైలజ’ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది శ్రీ సత్య. అటు తర్వాత ‘లవ్ స్కెచ్’ , ‘గోదారి నవ్వింది’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.
4) సినిమాల్లో నటించినా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే సీరియల్స్ లో ఆమెకు అవకాశాలు రావడానికి అవి సాయం చేశాయి. స్టార్ మాలో వచ్చే ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీ సత్య. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని సీరియల్స్ లో నటిస్తూ ఈమె పాపులర్ అయ్యింది.
5) కొంచెం క్రేజ్ వచ్చిన తర్వాత ‘అంతా భ్రాంతియేనా’ ‘తొందర పడకు సుందర వదనా’ సినిమాల్లో నటించింది కానీ అవి మంచి ఫలితాలను అందించలేదు.
6) ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది శ్రీ సత్య. వాటిలో తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసింది.
7) శ్రీ సత్యకి జంక్ ఫుడ్ అంటే చాలా.. బేసిక్ గా ఈమె నాన్ వెజ్ లవర్.
8) శ్రీ సత్య తండ్రి పేరు దుర్గా శ్రీనివాస్ ప్రసాద్. తల్లి పేరు లలిత.అలాగే ఈమె సోదరి పేరు సాయి ప్రవల్లిక.
9) శ్రీ సత్యకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. అతని సినిమాలు మిస్ కాకుండా చూస్తుంటుందట.
10) సోషల్ మీడియాలో కూడా శ్రీ సత్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 4లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరి శ్రీ సత్య ‘బిగ్ బాస్ 6’ లో ఎలా రాణిస్తుంది, ఎన్ని రోజులు హౌస్ లో కొనసాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కూల్ గోయింగ్ అన్నట్టు వ్యవహరిస్తోంది.