Swayamvaram Movie: త్రివిక్రమ్ కి లైఫ్ ఇచ్చిన ‘స్వయంవరం’ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

  • April 23, 2024 / 01:27 PM IST

తొట్టెంపూడి వేణు (Venu Thottempudi) ,లయ (Laya) జంటగా నటించిన ‘స్వయంవరం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1999 వ సంవత్సరం ఏప్రిల్ 22న రిలీజ్ అయ్యింది. ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ శ్యామ్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పెద్దగా చప్పుడు లేకుండానే రిలీజ్ అయ్యింది. కానీ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటితో అంటే 2024 ఏప్రిల్ 22 తో ‘స్వయంవరం’ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ముగ్గురికి లైఫ్ ఇచ్చింది. అందులో మనం గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్ (Trivikram) కూడా ఉన్నారు. కాబట్టి.. ‘స్వయంవరం’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ‘స్వయంవరం’ తొట్టెంపూడి వేణుకి డెబ్యూ మూవీ. వాస్తవానికైతే ముందుగా ఇతను సీనియర్ స్టార్ దర్శకుడు భారతీ రాజా (Bharathiraja) దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. అదే ఇతని డెబ్యూ మూవీ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

2) దీంతో స్నేహితుడు వెంకట్ శ్యామ్ ప్రసాద్… ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో వేణు సినిమా చేయాలి అనుకున్నారు.

3) హీరో – ప్రొడ్యూసర్ లాక్ అయిపోయారు కాబట్టి.. కథల అన్వేషణ మొదలుపెట్టారు. ఈ టైంలో వచ్చిన కథలు అన్నీ పెద్ద బడ్జెట్ ను డిమాండ్ చేసేవిగా ఉన్నాయట. దీంతో ఆలోచనలో పడ్డారు వెంకట్ శ్యామ్ ప్రసాద్.

4) ఇలాంటి టైంలో త్రివిక్రమ్ అనే కుర్రాడు వచ్చి అతనికి 2 కథలు చెప్పాడు. అందులో ఒకటి ‘స్వయంవరం’ కథ. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మార్కెట్ లెక్కల ప్రకారం సేఫ్ అవుతామని భావించి ఆ కథని లాక్ చేశారు. త్రివిక్రమ్ నే డైరెక్ట్ చేయమని వెంకట్ శ్యామ్ ప్రసాద్ చెప్పారట. కానీ గురూజీకి ఆ టైంలో దర్శకత్వం పై పట్టు లేకపోవడంతో నో చెప్పారట.

5) దీంతో విజయ భాస్కర్ ను డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. మొదట విజయ భాస్కర్ ‘ప్రార్థన’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. 1991 లో వచ్చిన ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ విజయ్ భాస్కర్ కి ఛాన్స్ ఇచ్చారు శ్యామ్ ప్రసాద్.

6) హీరోయిన్ గా ‘భద్రం కొడుకో’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన లయని ఎంపిక చేసుకున్నారు.

7) విప్లవాత్మక సినిమాలకి సంగీతం అందించే వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas Rao Yadav) ను.. ఈ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.ఇదో కూడా అప్పట్లో ఓ ప్రయోగం అని అంతా అనుకున్నారు. కానీ మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా మెప్పించింది.

8) త్రివిక్రమ్ రైటింగ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.

9) సినిమాని తక్కువ రోజుల్లోనే రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేయడానికి టీం చాలా కష్టాలు పడింది. డబ్బులు ఖర్చు పెట్టి.. మరీ రిలీజ్ చేశారు. మొదటి రోజు జనాలు లేరు. దీంతో సినిమా ప్లాప్ అయ్యింది అని నిరుత్సాహపడ్డారు టీం మెంబర్స్. కానీ తర్వాతి రోజు నుండి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

10) పోటీగా చిరంజీవి (Chiranjeevi) ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ఉన్నప్పటికీ ‘స్వయంవరం’ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. వేణు, లయ..లతో పాటు త్రివిక్రమ్ కి శుభారంభాన్ని ఇచ్చిన మూవీ ఇది. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ సినిమాకి కూడా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ గా మారిన తర్వాత త్రివిక్రమ్ సాధించిన సక్సెస్..లు అందరికీ తెలిసినవే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus