Allu Arjun: పాలకొల్లు టు పాన్ ఇండియా.. బన్నీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
April 8, 2022 / 03:47 PM IST
|Follow Us
హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి మనవడిగా,టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా, మెగా కాంపౌండ్ నుండి హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. అయినప్పటికీ తన ఫ్యామిలీ ఇమేజ్ పై ఆధార పడకుండా తన స్వశక్తి తో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తన అద్భుతమైన డ్యాన్స్, నటనతో ఈరోజు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి మన అల్లు అర్జున్ బెస్ట్ ఎగ్జాంపుల్. కష్టపడి పైకి రావాలి అనుకునే వాళ్ళందరికీ అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్ అనొచ్చు ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రేక్షకులు,సెలబ్రిటీలు మరియు అభిమానులు. ఈ రోజుతో అల్లు అర్జున్ 40 లోకి అడుగుపెడుతున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) 1983 వ సంవత్సరం ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించాడు అల్లు అర్జున్. 8 ఏళ్ళ పాటు అక్కడే పెరిగాడు. అయితే అల్లు అర్జున్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లుకి చెందిన. బన్నీ ఎన్నోసార్లు పాలకొల్లు వెళ్ళాడు. అక్కడి ఏరియాలు అన్నీ బన్నీకి బాగా తెలుసు.
2) అల్లు అర్జున్ కి ఒక అన్న, ఒక తమ్ముడు. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ హీరోగా కొనసాగుతున్నాడు, అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ నిర్మాతగా మారి ‘గని’ అనే చిత్రాన్ని నిర్మించారు.
3) అల్లు అర్జున్ బాల నటుడిగా పరిచయమైన మొదటి చిత్రం ‘విజేత’. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవిందే నిర్మాత.
4) అటు తర్వాత కమల్ హాసన్- కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘స్వాతి ముత్యం’ లో కూడా అల్లు అర్జున్ బాల నటుడిగా చిన్న అతిథి పాత్ర పోషించాడు.
5) ఈ సినిమాల తర్వాత అతని చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అని అల్లు అరవింద్ గారు సినిమాలకి దూరంగా ఉంచారు. అయితే ఇతనికి చదువు పై అంతగా ఇంట్రెస్ట్ లేదు. డ్యాన్స్ మరియు జిమ్నాస్టిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అవే ఇతన్ని సినిమాల వైపు మళ్ళేలా చేసాయి.
6) అల్లు అర్జున్ ‘గంగోత్రి’ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాలో నటించాడు. దీనికి కూడా అల్లు అరవింద్ గారే నిర్మాత. అసలు అల్లు అర్జున్ ఎలా నటించగలడు.. కెమెరా అంటే భయపడకుండా నటించగలడా లేదా అనే అనుమానంతో అల్లు అరవింద్ గారు ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్ర చేయించారు.
7) కానీ బన్నీ హీరోగా లాంచ్ అయ్యింది మాత్రం ‘గంగోత్రి’ తోనే..! ఆ మూవీలో అల్లు అర్జున్ లుక్ జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఇతను హీరోగా నిలబడడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘ఆర్య’ తో బన్నీ తన లుక్ ను మార్చుకోవడం మాత్రమే కాదు స్టార్ ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
8) ఇక ‘బన్నీ’ ‘దేశముదురు’ వంటి సినిమాలు అల్లు అర్జున్ ఇమేజ్ ను మరింతగా పెంచాయి.
9) కేరళలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మోహన్ లాల్, మమ్ముట్టి ల తర్వాత ఆ స్థాయిలో అక్కడ క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే..!
10) ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ వంటి చిత్రాలు బన్నీని దేశవ్యాప్తంగా పాపులర్ చేసాయి. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది.
11) టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ సంస్కృతిని పరిచయం చేసింది బన్నీనే. ‘దేశముదురు’ చిత్రం కోసం బన్నీ సిక్స్ ప్యాక్ చేసాడు. తర్వాత అతన్ని ఫాలో అయ్యి చాలా మంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయడం జరిగింది.
12) అంతే కాదు హెయిర్ స్ట్రయిటినింగ్ ను ‘ఆర్య2’ తో పరిచయం చేసింది కూడా బన్నీనే..!
13)ఇప్పుడు ప్రతీ సినిమాకి ముందు ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి. ఆ సంస్కృతి మొదలైంది కూడా అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రంతోనే..!
14) పాన్ ఇండియా లెవెల్లో తీయకపోయినా.. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం రూ.160 కోట్లకి పైగా షేర్ ను నమోదు చేసింది.
15) పాండమిక్, టికెట్ రేట్ల ఇష్యు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ‘పుష్ప’ సినిమా రూ.165 కోట్ల వరకు షేర్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది.