Vignesh Shivan: విగ్నేష్ శివన్ గురించి ఆసక్తికరమైన 10 విషయాలు..!
June 12, 2022 / 11:04 AM IST
|Follow Us
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ను 7 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుని తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పింది. 37 ఏళ్ళ వయసులో ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. తమిళ నాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ పార్క్ హోటల్లో నయన్ విగ్నేష్ ల పెళ్లి జరిగింది.జూన్ 9న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది.నయన్ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ పద్దతిలోనే విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. విగ్నేష్ శివన్ నయనతార భర్త,ఒకప్పుడు నయనతార ప్రియుడు గానే తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. కొంతమంది అయితే అతను కోలీవుడ్ దర్శకుడు అని కొంచెం ఎక్కువ తెలుసు అనుకుంటారు. కానీ విగ్నేష్ శివన్ గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :
1)ప్రప్రధమంగా చెప్పుకోవాల్సిన విషయం. విగ్నేష్ సినిమాల్లోకి రాక ముందు నయనతారకి పెద్ద ఫ్యాన్. అతను మల్టీ టాలెంటెడ్ అన్న విషయం ఇక్కడ ఎక్కువ మందికి తెలిసుండదు.
2) పాటల రచయితగా విగ్నేష్ కెరీర్ ను ప్రారంభించాడు. తమిళ్ లో అతను దాదాపు 50 కి పైగా పాటలు రాసిన సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అనిరుధ్ సంగీతం అందించిన చిత్రాలకే ఇతను ఎక్కువ పాటలు రాయడం జరిగింది. అనిరుధ్ కు ఇతను మంచి ఫ్రెండ్. విగ్నేష్ సినిమాలకు దాదాపు అనిరుధ్ సంగీతం అందిస్తూ ఉంటాడు.
3) విగ్నేష్ శివన్ లో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఇతను పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
4) నిర్మాతగా కూడా ‘రౌడీ పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించి విగ్నేష్ శివన్.. ‘నేత్రికన్’, ‘కుజంగల్’,(ఊర్కురువి, కనెక్ట్) వంటి చిత్రాలు నిర్మించారు.
5) డిస్ట్రిబ్యూటర్ గా కూడా ‘రాకీ’ అనే యాక్షన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు.
6) నటుడిగా విగ్నేష్ శివన్.. ‘సివి’, ‘పోడా పోడి’ వంటి చిత్రాల్లో నటించడం జరిగింది. ఇందులో ‘పోడా పోడి’ చిత్రానికి ఆయనే దర్శకుడు కావడం విశేషం.
7) ఇక దర్శకుడిగా ‘పోడా పోడి’ ‘నానుమ్ రౌడీ దాన్’ ‘తానా సెర్న్ద్ కొట్టం’ ‘పావ కాదయిగల్’ ‘కాతు వాకుల రెండు కాదల్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలకు విగ్నేష్ రైటర్ కూడా కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి. తానా సెర్న్ద్ కొట్టం’ చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సూర్య, , కీర్తి సురేష్ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం తెలుగులో ‘కన్మణి రాంబో కటీజ’ పేరుతో రిలీజ్ అయ్యి సో సో టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించేలా కలెక్ట్ చేసింది.సమంత, నయన తార ఇందులో హీరోయిన్లుగా నటించగా.. విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.
8) విజయ్ సేతుపతి, అనిరుధ్, సమంత..విగ్నేష్ కు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్. శింబు కూడా విగ్నేష్ దర్శకుడిగా మారడానికి సాయపడ్డారు.
9) ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం టైములో నయనతారకి ఇతను బాగా దగ్గరయ్యాడు. అప్పటి నుంచి ఆమె లుక్ ను కంప్లీట్ గా మార్చేసి, కథల ఎంపికలో సాయం చేస్తూ వచ్చాడు. ‘రాజా రాణి’ చిత్రం నుంచి నయనతార మళ్ళీ పుంజుకోవడం మాత్రమే కాకుండా ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదగడంలో ఇతని కృషి ఎంతో ఉంది.
10) నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేష్ దగ్గరుండి చూసుకుంటున్నారు. నయన్ ఓ సినిమాకి ఓకే చేయాలి అంటే విగ్నేష్ కు కూడా కథ నచ్చాలి. అప్పుడే ఆ మూవీకి నయన్ సైన్ చేస్తుంది. నయన్ ను పెళ్లి చేసుకోవడానికి తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి 7 ఏళ్ళు ఎదురుచూశాడు విగ్నేష్.