Indra: ‘ఇంద్ర’ కి మాత్రమే జరిగిన సరికొత్త పబ్లిసిటీ ఏంటో తెలుసా?
August 22, 2024 / 04:01 PM IST
|Follow Us
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు. అంటే యావత్ మెగా అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. దీంతో ఈసారి మెగాస్టార్ బర్త్ డేని ‘ఇంద్ర’ (Indra) (4K) రీ రిలీజ్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. బాగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘ఇంద్ర’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. 2002 జూలై 24న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకి ముందు చిరంజీవి చేసిన ‘మృగరాజు’ (Mrugaraju) ‘శ్రీమంజునాథ’ ‘డాడీ’ (Daddy) వంటి చిత్రాలు నిరాశపరిచాయి.
Indra
ఆ టైంలో వచ్చిన ‘ఇంద్ర’ సినిమా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టింది. ‘ఇంద్ర’ లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పించే అంశాలు ‘ఇంద్ర’లో బోలెడు. అయితే ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ తర్వాత టీమ్.. ఈ చిత్రాన్ని మరింత కొత్తగా ప్రమోట్ చేసింది. బహుశా ఈ సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. అదేంటి అంటే.. ‘ ‘ఇంద్ర’ సినిమాలో ఓ అందమైన తప్పు జరిగింది? అదేంటో కనిపెట్టి చెప్పిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తామని..’ ఆ టైంలో టీం ఓ ఛానల్ ద్వారా ప్రకటించింది.
‘ఆ అందమైన తప్పు ఏంటా?’ అందరూ టీవీలకు అతుక్కుపోయి చూశారు. వాస్తవానికి ‘ఇంద్ర’ లో చిరంజీవి… ఆర్తి అగర్వాల్ కి బావ వరస అవుతాడు. అయినప్పటికీ చిరంజీవి మేనకోడలు, ఆర్తి అగర్వాల్ మేనల్లుడు పెళ్లి చేసుకుంటారు. అలా చూసుకుంటే.. వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్ళ వరస. అయినప్పటికీ ఇది మెయిన్ మిస్టేక్ కాదని ‘ఇంద్ర’ టీం తెలిపింది. అసలైన మిస్టేక్ ఏంటంటే.. ఓ సీన్లో ఇంద్రకి అతని అక్క..లు రాఖీ కడతారు.
అయితే బయట పిల్లలు హొలీ ఆడతారు. ఆ సీన్.. తప్పని. హోలీ , రాఖీ పండుగలు ఒకే టైంలో రావని టీం తెలిపింది. అది ఒక అందమైన తప్పు అంటూ ప్రమోషన్ చేసుకుంది. వాస్తవానికి ఆ సీన్ వల్లనే కథ ముందుకు వెళ్తుంది. అది ఎలాగో ఒకసారి మళ్ళీ ‘ఇంద్ర’ సినిమా చూస్తే అందరికీ క్లారిటీ వస్తుంది.